అల్లు అర్జున్ కి పోటీ ఇచ్చే భామ ఎవరో?

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా టైటిల్ తో పాటుగా విడుదలైన టీజర్ [more]

Update: 2019-08-19 05:19 GMT

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా టైటిల్ తో పాటుగా విడుదలైన టీజర్ తో ‘అల వైకుంఠపురములో’ ‘సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిలా కాస్త రఫ్ లుక్ లో కనబడుతున్నాడు. గతంలో త్రివిక్రంతో చేసిన’ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలు హిట్ అవడంతో.. ఇప్పుడు ఈ ‘అల వైకుంఠపురములో’ సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ 2 షేడ్స్ లో కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఒకటి మిడిల్ క్లాస్ అబ్బాయిగా అయితే.. మరొకటి ఓ మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగిగా కనిపిస్తాడంటున్నారు.

ఇక చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజ హెగ్డే, నివేత పేతురేజ్ లు నటిస్తున్నారు. అలనాటి మేటి బాలీవుడ్ హీరోయిన్ టబు కూడా ఈ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇకపోతే డీజే లో అల్లు అర్జున్ తో పూజ హెగ్డే అదిరిపోయే స్టెప్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోనూ ఈ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే థియేటర్స్ లో విజిల్స్ పడడం ఖాయమంటున్నారు. అయితే ఈ సినిమాలో ఓ ఐటెం ప్లాన్ చేసినట్లుగా.. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆ ఐటెం కోసం స్పెషల్ గా ట్యూన్స్ కడుతున్నాడట. మరి ఈ సాంగ్ కోసం ఓ టాప్ హీరోయిన్ తీసుకోవాలని త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ భావిస్తున్నారట. మాస్ ఆడియన్స్ కొసం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న ఈ సాంగ్ లో మాస్ స్టెప్స్ ఉంటాయట. మరి ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ తో కలిసి ఆ మాస్ స్టెప్స్ వెయ్యబోయే ఆ భామ ఎవరంటూ అప్పుడే మెగా ఫాన్స్ కిందా మీద అవుతున్నారు.

Tags:    

Similar News