పవన్ మాట బన్నీ నిజం చేస్తాడా?

Update: 2018-05-01 09:17 GMT

మొన్న జరిగిన 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక అతను బన్నీని ఉదేశించి అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని సెన్సషనల్ కామెంట్స్ చేశాడు. మెగా ఫ్యామిలీ కి పాలిటిక్స్ ఏమి కొత్త కాదు. మొదట ఆ ఫ్యామిలీ నుండి మెగా స్టార్ చిరంజీవి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అన్నయతో ప్రజా రాజ్యం పార్టీ మీటింగ్స్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత తానె స్వయంగా ఓ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.

ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కి కూడా రాజకీయాలు కొత్త కాదు. ప్రజా రాజ్యం పార్టీలో చిరంజీవికి అల్లు అరవింద్ సపోర్ట్ గా పనిచేసాడు. ఫ్యూచర్ లో బన్నీ రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదట. అతడికి రాజకీయాల మీద విపరీతమైన ఆసక్తి ఉందంటూ మొన్నటి ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక వ్యక్తి చెప్పాడు. అతని పేరు పవన్ రెడ్డి.

ఈ ఫంక్షన్ లో అయన స్టేజిపై నుండి బన్నీని ఉదేశిస్తూ మాట్లాడుతూ.. బన్నీ గురించి ఎవరికి తెలియని ఒక విషయం ఉందంటూ.. అతడికి పాలిటిక్స్ అంటే చాలా ఇష్టమని.. రాజకీయాల గురించి ప్రతి విషయం తెలుసుకుంటూ ఉంటాడని.. కాబట్టి ఫ్యూచర్ లో బన్నీ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని అనుకుంటున్నానని.. అతను రావాలని అభిలషించాడు పవన్ రెడ్డి. అతను ఆలా అనగానే బన్నీ నవ్వుతు లేదు లేదు అంటూ చేతులు ఊపుతూ కనిపించాడు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే బన్నీ ఏ స్వయంగా నోరు విప్పాలి

Similar News