బన్నీ.. పవన్ గురించి ప్రస్తావించేనా?

Update: 2018-04-29 11:59 GMT

‘సరైనోడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని బన్నీని అడిగితే 'నేను చెప్పను బ్రదర్' అనే కామెంట్ తో మొదలైన రగడ చివరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీకి శత్రువుగా మారిపోయి అతడి సినిమాలకు నెగటివ్ కామెంట్స్ ఇచ్చే పరిస్థితి వెళ్లిపోయింది. ఈ వివాదంపై తేరా దించుదామని.. పవన్ ఫ్యాన్స్ కు సర్దిచెబుదామని బన్నీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

రీసెంట్ గా శ్రీరెడ్డి పవన్ పై చేసిన కామెంట్స్ తో మెగా ఫామిలీ నుండి పవన్ కు సపోర్ట్ గా ఒక్కొక్కరుగా మీడియా ముందుకు రావడం.. ఈ క్రమంలోనే పవన్‌కు మద్దతుగా బన్నీ కూడా రంగంలోకి దిగడం జరిగింది. పవన్ చేసిన ట్వీట్స్ కి రీ ట్వీట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని కూల్ చేసాడు బన్నీ. కొన్ని రోజులు కిందట " నా పేరు సూర్య " ఆడియో ఈవెంట్ లో పవన్ గురించి బన్నీ పాజిటివ్‌గా మాట్లాడేసి పవర్ స్టార్ అభిమానుల మనసు గెలిచాడు బన్నీ. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఇష్యూను బన్నీ భలేగా వాడుకున్నాడే అన్న అభిప్రాయం కలిగింది.

మరి బన్నీ ఇంతటితో పవన్ టాపిక్‌కు తెరదించేస్తాడా.. ఇక ముందు కూడా పవన్ పేరెత్తుతాడా అన్నది ఆసక్తికరం. ఈరోజు 'నా పేరు సూర్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ గచ్చిబౌలి స్టేడియం లో గ్రాండ్ లెవెల్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి ముఖ్య అథితిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నాడు. కచ్చితంగా ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ నినాదాలతో హోరెత్తించడం ఖాయం. చరణ్ ఏం మాట్లాడతాడేమో కానీ.. బన్నీ ఏమంటాడన్నదే ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Similar News