గొడవలపై స్పందించిన బన్నీ

Update: 2018-04-08 10:14 GMT

క్రికెట్ టీంకి సరిపోయే అంత మంది మెగా ఫ్యామిలీ నుండి హీరోస్ టాలీవుడ్ లోకి వచ్చారనేది అందరికి తెలిసిన విషయమే. ఇంతమంది హీరోస్ ఉన్న వారు యూనిటీ చూపిస్తుంటారు కానీ కొంత కాలం నుండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పడటం లేదు. ఇందుకు కారం అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి అతను పవన్ అభిమానులకు శత్రువు అయిపోయాడు.

దీంతో ఫ్యాన్స్ లో కలహాలు మొదలయ్యాయని.. మెగా అభిమానులు వర్గాలుగా విడిపోయారని.. రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. అయితే దానిపై లేటెస్ట్ గా అల్లు అర్జున్ స్పందించారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ హీరోల అభిమానుల్లో గొడవలు లేవని తాను అననని బన్నీ చెప్పాడు. మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోస్ ఉన్నారని ఫ్యాన్స్ కు ఒక్కొక్కరికి ఒకరు నచ్చుతారని బన్నీ అన్నాడు.

ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ రావడం మామూలే అని బన్నీ అభిప్రాయపడ్డాడు. పవన్ కళ్యాణ్ వచ్చిన కొత్తలో ఆయనకంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడ్డాక.. చిరంజీవి ఫ్యాన్స్ కు ...పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గొడవలు అయ్యాయని నాకు తెలుసు అని అన్నాడు బన్నీ. అభిమానుల మధ్య కొన్నిసార్లు అపార్థాలు వస్తాయని.. మళ్లీ కలిసిపోతుంటారని.. ఇవన్నీ తాత్కాలికమే అని బన్నీ అన్నాడు.

Similar News