తూచ్ ఆ సినిమాలో బన్నీ లేడు..!

చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ నటించినా, బన్నీ నటించినా, పవన్ కళ్యాణ్ నటించినా ఆ సినిమా కొచ్చే క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పటికే చిరు ఆచార్యలో [more]

Update: 2020-04-23 07:43 GMT

చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ నటించినా, బన్నీ నటించినా, పవన్ కళ్యాణ్ నటించినా ఆ సినిమా కొచ్చే క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పటికే చిరు ఆచార్యలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఆ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. తాజాగా చిరు లూసిఫెర్ రీమేక్ చెయ్యబోతున్నాడు. ఆ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తాడని టాక్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. చిరు లూసిఫెర్ రీమేక్ ని సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

సుజిత్ ప్రస్తుతం లూసిఫెర్ తెలుగు వెర్షన్ ని రెడీ చేసే పనిలో బిజీగా వున్నాడట. తెలుగు ప్రేక్షకులకు మెచ్చేలా లూసిఫెర్ తెలుగు వెర్షన్ ని సిద్ధం చేస్తున్నాడట. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్.. ఓ కీలక పాత్రలో అదీనూ, మెగాస్టార్ అనుచరుడి పాత్ర చేయబోతున్నాడని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం బన్నీ ఈ లూసిఫెర్ రీమేక్ లో చిరు అనుచరుడిగా చెయ్యడం లేదని.., సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న న్యూస్ లన్ని నిజాలు కావని చెబుతున్నారు.

Tags:    

Similar News