మరో సినిమాను లైన్ లో పెట్టిన బన్నీ..!

నా పేరు సూర్య సినిమా తరువాత అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయలేదు. మరి లేట్ అవుతుందనేమో వరుస బెట్టి సినిమాలు ఓకే [more]

Update: 2019-03-28 11:27 GMT

నా పేరు సూర్య సినిమా తరువాత అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయలేదు. మరి లేట్ అవుతుందనేమో వరుస బెట్టి సినిమాలు ఓకే చేస్తున్నాడు బన్నీ. త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అలానే సైలెంట్ గా సుకుమార్ తో ఓ సినిమా ఓకే చేసేసాడు. ఈ రెండింటి మధ్యలో మరో సినిమాకు ఓకె చెప్పేసాడు. అది కూడా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడం విశేషం. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. స్క్రిప్ట్ మొత్తం విన్న బన్నీ వెంటనే ఓకే చేసేసాడట. ఈ సినిమాను వేణు శ్రీరామ్ టేక్ ఓవర్ చేస్తున్నాడు.

లైన్ లో మరిన్ని సినిమాలు

ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ సినిమాల తరువాత వేణు శ్రీరామ్ ఈ స్క్రిప్ట్ మీద చాలాకాలం నుండి వర్క్ చేస్తున్నాడు. సుకుమార్ ప్రాజెక్టు లేట్ అవుతుంది కాబట్టి, బన్నీ ఆ గ్యాప్ లో ఈ సినిమాను ఫినిష్ చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంటే అప్పుటివరకు సుకుమార్ ఆగాల్సిందేనా? ఇవే కాకుండా విక్రమ్ కుమార్ తో ఒక సినిమా, మురుగదాస్ తో ఓ సినిమా చేయనున్నాడు.

Tags:    

Similar News