అల్లు అర్జున్ ఎవ‌రితో ముందు చేస్తారు..?

‘నా పేరు సూర్య’ తరువాత బన్నీ చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో రెండు [more]

Update: 2019-05-06 07:26 GMT

‘నా పేరు సూర్య’ తరువాత బన్నీ చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను చేయాలని డిసైడ్ అయ్యాడు బన్నీ. తన సినిమాల విషయంలో వేగం పెంచిన బన్నీ నెక్స్ట్ మూవీ సుకుమార్ తో చేయాలా లేదా వేణు శ్రీరామ్ తో చేయాలా అని కాస్త డైలామాలో పడ్డాడంట‌. ఒకపక్క త్రివిక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే మరోపక్క సుకుమార్ స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టాడు బన్నీ. ఈ మూవీ ఈ నెల 11న లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. అయితే ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంద‌ని మాత్రం ఇప్పుడే చెప్పలేని ప‌రిస్థితి. ఎందుకంటే… సుకుమార్ సినిమా కోసం బ‌న్నీ గెట‌ప్ మార్చాల్సిన అవ‌స‌రం ఉందట‌.

స్క్రిప్ట్ రెడీగా ఉండ‌టంతో…

ఇందులో బన్నీ గడ్డంతో కనిపించనున్నాడు. కాబ‌ట్టి త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయ్యాకే సుకుమార్ తో చేయాల్సి వస్తుంది. సుకుమార్ కి కూడా స్క్రిప్ట్ విషయంలో ఇంకా టైం పటేలా ఉంది. సుక్కు సెకండాఫ్ విష‌యంలో ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతూనే ఉన్నాడు. అయితే వేణు శ్రీరామ్ మాత్రం ఐకాన్ ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. కాబ‌ట్టి త్రివిక్రమ్ సినిమా చేస్తూ… ఐకాన్ పూర్తి చేసే ఛాన్సులు కూడా పుష్క‌లంగా ఉన్నాయి. ఇదే జరిగితే సుక్కు సినిమా కంటే ముందు ఐకాన్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. కానీ సుక్కు మాత్రం వేణు శ్రీరామ్ పూర్తి నరేషన్ ఇచ్చేలోపు తన స్క్రిప్ట్ ని కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. మరి వీరిద్దరిలో ఎవరు ముందు బన్నీని డైరెక్ట్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News