బన్నీ ప్లాన్ మార్చాడా?

అల్లు అర్జున్ కూడా ఊహించి ఉండడు అల వైకుంఠపురములో అంత పెద్ద హిట్ అవుతుంది అని. ఎందుకంటే త్రివిక్రమ్ అజ్ఞాతవాసి డిజాస్టర్ దెబ్బకి ఎన్టీఆర్ చెప్పినట్టుగా అరవింద [more]

Update: 2020-01-30 06:29 GMT

అల్లు అర్జున్ కూడా ఊహించి ఉండడు అల వైకుంఠపురములో అంత పెద్ద హిట్ అవుతుంది అని. ఎందుకంటే త్రివిక్రమ్ అజ్ఞాతవాసి డిజాస్టర్ దెబ్బకి ఎన్టీఆర్ చెప్పినట్టుగా అరవింద సమేత చేసాడు. అది జస్ట్ హిట్ అయ్యింది. అయినా అల్లు అర్జున్, త్రివిక్రమ్ ని నమ్మి ఆలా వైకుంఠపురములో సినిమా చేసాడు. త్రివిక్రమ్ స్టయిల్ కన్నా ఎక్కువగా అల్లు అర్జున్ మ్యానరిజం సినిమాకి హైలెట్ అయ్యింది. ఈ సినిమా అనుకోని పెద్ద హిట్ అవడంతో.. ఇప్పుడు అల్లు అర్జున్ ప్లాన్ మార్చినట్టుగా కనబడుతుంది. అంటే సుకుమార్ సినిమా విషయంలో తొందర లేకుండా కూల్ గా సినిమా చెయ్యాలని సుకుమార్ ని అస్సలు తొందరపెట్టకూడదని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.

అల వైకుంఠపురములో అల విడుదల కాగానే అల్లు అర్జున్, సుకుమార్ సినిమా తో సెట్స్ మీదకెళ్తాడని అన్నారు. కానీ నిన్నటివరకు అల సక్సెస్ సెలెబ్రేషన్స్, సక్సెస్ మీట్స్, వంటి విషయాలతో బిజీగా అయిన బన్నీ ఇప్పుడు ఫ్యామిలీతో టూర్ వెళ్లబోతున్నాడని, అక్కడే బన్నీ సుక్కు సినిమా కోసం హెయిర్ స్టయిల్ దగ్గర్నుండి గెటప్ మొత్తం చేంజ్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈలోపు సుకుమర్ స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసుకోమని..కంగారేం లేదని.. అంతా కూల్ గా చేద్దామని అంటున్నాడట. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ని పిలిచి.. నెమ్మదిగా టూన్స్ రెడీ చెయ్యమని హడావిడిగా చేసి చెడగొట్టొద్దని సున్నితంగా చెప్పినట్లుగా ఫిలింనగర్ టాక్. ఇక బన్నీ, సుకుమర్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం మార్చ్ మొదటి వారంలో దిగబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్

Tags:    

Similar News