అల్లు అర్జున్ శివ డైరెక్షన్ లోనా..?

Update: 2018-08-30 08:33 GMT

నా పేరు సూర్య ఫ్లాప్ తో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడానికి బాగా టైం తీసుకుంటున్నాడు. దాదాపుగా ఐదు నెలలు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పటికి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అనే వార్తలు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ... అల్లు అర్జున్ నుండి మాత్రం క్లారిటీ రావడం లేదు. తాజాగా అల్లు అర్జున్ బై లింగ్యువల్ మూవీ ఒకటి తెర మీదకొచ్చింది.

డైరెక్టర్ ను మార్చేసి...

నా పేరు సూర్య కన్నా ముందు అల్లు అర్జున్ తెలుగు, తమిళంలో కలిపి లింగు స్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఒక బై లింగువల్ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసాడు. కానీ ఏళ్లుగా అర్జున్ ఆ సినిమాని హోల్డ్ లో పెట్టి నా పేరు సూర్య సినిమా చేసాడు. కొన్ని అనుకోని కారణాలతో ఆ బై లింగ్యువల్ మూవీని వదిలేసిన అల్లు అర్జున్ ఇప్పుడు స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఆ మూవీని మొదలెట్టా బోతున్నాడని, కానీ డైరెక్టర్ గా లింగుస్వామిని తప్పిస్తున్నారనే న్యూస్ వినబడుతుంది.

వేసవిలో పట్టాలపైకి...

లింగు స్వామి ప్లేస్ లో తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఈ మూవీ చేయబోతున్నాడనే టాక్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. వీరం, వేదాళం చిత్రాల దర్శకుడు శివతో అల్లు అర్జున్ తో కలిసి ప్రాజెక్ట్ ను తెరకెక్కించనున్నారని సమాచారం. కాకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇంకా ఈ శివ - అల్లు అర్జున్ కాంబో మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News