యంగ్ డైరెక్టర్ తో స్టైలిష్ స్టార్..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. చాలా గ్యాప్ తరువాత బన్నీ త్రివిక్రమ్ తో సినిమా [more]

Update: 2019-01-26 06:29 GMT

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. చాలా గ్యాప్ తరువాత బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫ్యూచర్ పై దృష్టి పెట్టి సినిమాల కథలు ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్రివిక్రమ్ చెప్పిన కథలో కూడా కొన్ని మార్పులు చెప్పి రెడీ చేయించుకున్నాడు. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా నెల టైం ఉండటంతో ఈ లోపల వేరే కథలు కూడా వింటున్నట్టు టాక్.

కథ నచ్చడంతో…

రీసెంట్ గా బన్నీకి సాహూ డైరెక్టర్ సుజీత్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా తీర్చిదిద్దమని సూచించాడట. ప్రస్తుతం సుజిత్ ప్రభాస్ సాహూ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన వెంటనే బన్నీ సినిమా కథ మీద కూర్చోనున్నాడు సుజీత్. ఈ సినిమాని యూవీ వారే సెట్ చేస్తున్నారు. ఒకవేళ బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే గీతా ఆర్ట్స్ తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించేందుకు రెడీగా ఉన్నారట. సాహూ తరహాలోనే బన్నీ – సుజీత్ ల చిత్రం ఉండబోతుందని సమాచారం.

Tags:    

Similar News