అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ ఇదే..!

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని అందరికీ తెలిసిందే. సినిమా స్క్రిప్ట్ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో అసలు ఈ సినిమా [more]

Update: 2019-03-16 09:50 GMT

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని అందరికీ తెలిసిందే. సినిమా స్క్రిప్ట్ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో అసలు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇద్దరికీ పూర్తి నమ్మకం కుదిరాకే మొదలు పెడదామని స్టైలిష్ స్టార్.. త్రివిక్రమ్ తో చెప్పాడట. అందుకే త్రివిక్రమ్ చాలా స్లోగా ఈ సినిమా పనులు చేస్తున్నాడని టాక్. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా కూడా సన్ అఫ్ సత్యమూర్తి తరహాలోనే ఉంటుందని, ఇందులో కూడా బలమైన ఫాదర్ సెంటిమెంట్ ఉంటుందని టాక్ నడుస్తుంది. అయితే సన్ అఫ్ సత్యమూర్తిలో లాగా ఇందులో ఫాదర్ పాత్ర స్టార్టింగ్ లో చనిపోయే పాత్ర కాదట. చివరివరకు ఉండే పాత్రట.

టైటిల్ ఫైనల్ చేసిన త్రివిక్రమ్

త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఇందులో చూడబోతున్నట్టు వినికిడి. ఇక ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసారు. ‘నాన్న నేను’ అనే పేరుని త్రివిక్రమ్ బలంగా రికమండ్ చేస్తున్నాడట. టైటిల్ కు తగ్గ పాత్రల కోసం త్రివిక్రమ్ తెగ ట్రై చేస్తున్నాడని టాక్. తండ్రి పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో ఒకరిని ఫిక్స్ చేసేందుకు ట్రై చేస్తున్నట్టుగా తెలిసింది. ఇక ఇందులో మరోసారి అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే ప్రధాన హీరోయిన్ గా క్యాథరిన్ సెకండ్ లీడ్ గా కనిపించనున్నారని టాక్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి.

Tags:    

Similar News