బన్నీ కి ఎందుకు అంత కాన్ఫిడెన్స్?

Update: 2018-05-04 04:19 GMT

రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా షూటింగ్స్ సమయంలో విమర్శలు వచ్చాయి. సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా స్టార్ట్ అయిందని మాటలు మొదటగా వినిపించినా.. మహేష్ టీం చూపించిన జోరు చూసి అందరూ ఆ విషయాన్ని మరచిపోయారు. మహేష్ అండ్ టీం సినిమా రిలీజ్ కి ముందు ప్రొమోషన్స్ లో యాక్టివ్ గా ఉండడం. మీడియాతో కూడా రెగ్యులర్ టచ్ లో ఉంటాడటం ఇలా చాలానే టెక్నిక్స్ పాటించారు.

ప్రమోషన్స్ తక్కువే.....

అంతే కాకుండా రిలీజ్ తర్వాత సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ అండ్ టీం ప్రొమోషన్స్ ఆపలేదు. నిన్ననే మహేష్, కైరా, కొరటాలతో ఓ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు ఈరోజు విడుదల అయిన అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లెక్క మరోలా ఉంది. ఈ సినిమాకు ముందు సినిమాకు సంబంధించి రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసి భారీ హంగామా.. ప్రమోషన్స్ చాలా తక్కువగానే ఉన్నాయి.

పాజిటివ్ టాక్ వస్తేనే....

అయితే బన్నీ అండ్ టీం ఇంకో ప్లాన్ ఉందంట. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ప్రచారం ఎక్కువగా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి బన్నీ సినిమాపై ఎంత కాంఫిడెన్స్ గా ఉన్నాడో అర్ధం అవుతుంది. ఏది ఏమైనా ఈరోజు రిజల్ట్ ను బట్టి బన్నీ నెక్స్ట్ ప్లాన్ ఉంటుంది.

Similar News