పోటాపోటీగా దిగుతున్నారు!!

Update: 2018-04-14 09:00 GMT

రామ్ చరణ్ 'రంగస్థలం' తో ఈ ఏడాది స్ట్రాంగ్ గా బోణి కొట్టాడు. 'రంగస్థలం' సినిమాతో నాన్ 'బాహుబలి' రికార్డులు సృష్టిస్తున్నాడు. మరి రామ్ చరణ్ 2018 మొదటగా 'రంగస్థలం' తో పెద్ద హీరోలందరికీ ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ తర్వాత లైన్ లో ఉన్న మహేష్ బాబు 'భరత్ అనే నేను' ఈనెల 20 న అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' వచ్చే నెల 4 న థియేటర్స్ లోకి రాబోతున్నాయి. మరి రంగస్థలం సినిమా హిట్ తో ఇప్పుడు మహేష్ బాబు కి అల్లు అర్జున్ సినిమా లపై భారీ అంచనాలతో పాటే బాధ్యతలు పెరిగిపోయాయి. మరి సినిమాల కంటెంట్ విషయంలో ఏ మాత్రం తగ్గినా.. బజ్ ఏ కొంచెం డౌన్ అయినా.. రిజల్ట్ ఎలా ఉంటుందనే విషయం.. ఇప్పటికే ఛల్ మోహన్ రంగ.. కృష్ణార్జున యుద్ధం చిత్రాల ఫలితాలతో తేలిపోయింది.

భారీ అంచనాలు....\

మరి మహేష్, అల్లు అర్జున్ సినిమాలకి దగ్గర దగ్గరగా భారీ బడ్జెట్ లే ఎక్కాయి. అలాగే సినిమాల మీద కూడా భారీ అంచనాలతో పాటు భారీగా క్రేజ్ కూడా ఉంది. మరి ఆ అంచనాలు అందుకోవడానికి రెండు సినిమాలు ప్రమోషన్స్ ని చిత్ర టీమ్స్ ఒక రేంజ్ లో చేపట్టేశాయి. ఇప్పటికే పోటాపోటీగా మార్కెట్ లోకి సినిమా ప్రోమోస్ తో పాటు లిరికల్ వీడియోస్ ని కూడా వదులుతూ తమ సినిమాలపై అంచనాలు భారీగా పెంచేస్తున్నారు. నిన్నటికి నిన్న 'భరత్ అనే నేను' నుంచి హీరోయిన్ ఆండ్రియా పాడిన 'అరెరె.. ఇది కలలా ఉందే' అనే సాంగ్ మేకింగ్ తో కలిపి లిరికల్ సాంగ్ విడుదల చేశారు. అలాగే అల్లు అర్జున్ కూడా 'నా పేరు సూర్య' నుంచి 'మన కథ బ్యూటిఫుల్' అంటూ సాంగ్ వదిలాడు.

ప్రభాస్ ను తెచ్చి.....

మరి 'భరత్ అనే నేను' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ ఎన్టీఆర్ ని తెచ్చుకుని.. ఆ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేస్తే.. ఇప్పు నా పేరు సూర్య ఈవెంట్ కోసం అల్లు అర్జున్ బాహుబలి ప్రభాస్ ని తెచ్చుకుని తన సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. మరి ప్రతి విషయంలోనూ పోటాపోటీగా నిలుస్తున్న ఈ సినిమాలు రెండూ ఫలితాల విషయంలోనూ పోటాపోటీగా నిలుస్తాయో లేదో అనేది మాత్రం ప్రేక్షకులే నిర్ణయిస్తారు.

Similar News