పుష్ప కోసం మరీ అంత తగ్గాలా?

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో హిట్ తర్వాత యమా జోరులో ఉన్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ రావడంతోనే మాములుగా తెరకెక్కాల్సిన పుష్ప కాస్తా పాన్ ఇండియా [more]

Update: 2020-07-27 06:12 GMT

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో హిట్ తర్వాత యమా జోరులో ఉన్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ రావడంతోనే మాములుగా తెరకెక్కాల్సిన పుష్ప కాస్తా పాన్ ఇండియా మూవీ అయ్యి కూర్చుంది. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మరీ రఫ్ గా లారీ డ్రైవర్ లుక్ లో ఇరగదీస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ రఫ్ గెడ్డం, రఫ్ హెయిర్ స్టయిల్, లుక్ కూడా ఊర మాస్ గా పుష్ప లుక్ లోనే రివీల్ అయ్యింది. పుష్ప కోసం లాంగ్ హెయిర్ స్టయిల్ అండ్ గెడ్డం తో అల్లు అర్జున్ కొత్తగా కనిపించాడు. మరి మార్చ్ లో పట్టాలెక్కాల్సిన పుష్ప కరోనా కారణంగా ఆగింది. అయినా అల్లు అర్జున్ పుష్ప లుక్ లోనే కంటిన్యూ అవుతున్నాడు. అదే లాంగ్ హెయిర్, అదే గెడ్డం తో ఉన్నాడు.

ఇక కరోనా లాక్ డౌన్ వేళా అల్లు అర్జున్ అందరిలా జిమ్ లోనో ఇంట్లోనో వరౌట్స్ చెయ్యకుండా… ఏకంగా పబ్లిక్ లో అంటే కెసిఆర్ పార్క్ లోనో, లేదంటే సిటీ ఔట్స్ కట్స్ లోనో వేకింగ్, జాగింగ్ చేస్తూ అల్లు అర్జున్ ఏకంగా ఎనిమిది కిలోల బరువు తగ్గాడట. పుష్ప సినిమాలో పుష్పక్ నారాయణ్ పాత్ర కోసమే అల్లు అర్జున్ ఇలా వెయిట్ తగ్గాడని అంటున్నారు. మరి కరోనా ఉధృతి తగ్గగానే సుకుమార్ – అల్లు అర్జున్ లు శరవేగంగా పుష్ప షూటింగ్ ని మొదలు పెట్టేస్తారు.  ఈలోపు అల్లు అర్జున్ మరింతగా బరువు తగ్గి.. చాకులా తయారై.. పుష్ప కోసం మాస్ లుక్ లోకి మారతాడన్నమాట. 

Tags:    

Similar News