అల్లు అర్జున్ నిజంగానే ఆశపడుతున్నాడా?

Update: 2018-07-17 07:45 GMT

నా పేరు సూర్య తో ఖంగు తిన్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మనం, హలో ఫెమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మొదలు పెడుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా వున్న విక్రమ్ కుమార్ అల్లు అర్జున్ తో కలిసి అతి త్వరలోనే సెట్స్ మీదకెళ్లడానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఇక ఈ లోపు అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఫుల్ టైం స్పెండ్ చెయ్యడమే కాదు.. మనోడికి బాలీవుడ్ మీదకి గాలి మళ్లినట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలొసున్నాయి. ఆలు అర్జున్ ఆ మధ్యన ముంబై వెళ్లినట్లుగా అక్కడ బాలీవుడ్ దర్శకులతో మీట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.

ఒక వైపు విక్రమ్ కుమార్ తో యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తూనే మరో వైపు బాలీవుడ్ మూవీ ని అల్లు అర్జున్ చేయబోతున్నాడనే న్యూస్ మాత్రం బాగా స్ప్రెడ్ అయ్యింది. ఎలాగూ తన సినిమాలకు హిందీ యూట్యూబ్ లో మాంచి గిరాకీ ఉండడం.. తాజాగా సరైనోడు సినిమాతో బాలీవుడ్ యూట్యూబ్ రికార్డులను తిరగరాయడంతో.. ఒకసారి డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేస్తే బావుంటుందని అల్లు అర్జున్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరి నిజంగానే బన్నీ బాలీవుడ్ పై ఆశ పడుతున్నాడా... లేదంటే తన బాలీవుడ్ ఎంట్రీ పై ఎప్పుడో స్పందించేవాడు. మరి ఇన్నిరకాల వార్తలొస్తున్నప్పటికీ... అల్లు అర్జున్ మౌనం చూస్తుంటే అల్లు అర్జున్ బాలీవుడ్ మీద ఆశపడుతున్నడనిపిస్తుంది.

ఇకపోతే అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ సినిమా తో పాటుగా దర్శకుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా చెయ్యాలనుకుంటున్నాడనే న్యూస్ కూడా ఉంది. మరి విక్రమ్ కుమార్ సినిమా కే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇపుడు అల్లు అర్జున్ బాలీవుడ్ మూవీ, అలాగే త్రివిక్రమ్ తో సినిమాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చూద్దాం అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ అండ్ త్రివిక్రమ్ తో సినిమాల విషయంలో ఎంతవరకు క్లారిటీ వస్తుంది అనేది.

Similar News