ఎంత ఖర్చైనా.. విజయ్ సేతుపతే విలన్?

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో ప్రభంజనం మాములుగా లేదు. దసరా, దీపావళి పండగలకు అల వైకుంఠపురములో సినిమా పోస్టర్స్, [more]

Update: 2019-10-29 06:52 GMT

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో ప్రభంజనం మాములుగా లేదు. దసరా, దీపావళి పండగలకు అల వైకుంఠపురములో సినిమా పోస్టర్స్, సాంగ్స్ నానా రచ్చ చేస్తున్నాయి. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ తో లైన్ లోకొస్తాడో, లేదంటే సుకుమార్ సినిమాని పట్టాలెక్కిస్తాడో కానీ.. సుకుమార్ – అల్లు అర్జున్ సినిమా విషయంలో మాత్రం రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతుంది.

విజయ్ వస్తేనే విజయం…

సుకుమార్, అల్లు అర్జున్ కోసం రశ్మికాని హీరోయిన్ గా సెలెక్ట్ చేయబోతున్నాడనే టాక్ ఉండనే ఉంది. ఇక కథ కూడా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండబోతుందనేది పాత న్యూస్. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి విలన్ గా విజయ్ సేతుపతి నటించబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే మెగా హీరో వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమా కోసం విలన్ అవతారమెత్తిన విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని సుకుమార్… అల్లు అర్జున్ విలన్ రోల్ కి సంప్రదించినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి చిరు సైరా నరసింహారెడ్డిలో ఓ కీ రోల్ లో అదరగొట్టిన విజయ్ సేతుపతి, ఉప్పెన విలన్ గా నటిస్తుండడంతో.. అల్లు అర్జున్ కోసం కూడా విలన్ గా దిగుతాడని ఖచ్చితంగా చెబుతున్నారు. ఇక విజయ్ సేతుపతి అంగీకరిస్తే అల్లు అర్జున్ – సుక్కు సినిమాకి తమిళనాట భారీ గిరాకీ ఉంటుందని… ఎర్ర చందనం స్మగ్లింగ్ అంతా తమిళనాడు బోర్డర్ లోనే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి విజయ్ సేతుపతిని విలన్ గా ఎంత ఖర్చు పెట్టి అయినా తీసుకురావాలనుకుంటున్నారు.

 

Tags:    

Similar News