బన్నీవి నాలుగు సినిమాలట…!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు [more]

Update: 2019-08-03 08:45 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు అల్లు అర్జున్ వరసబెట్టి సినిమాలు ఓకే చేస్తున్నాడు. వచ్చే ఏడాది అల్లు అర్జున్ మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశముంది. దానికి తోడు మార్కెట్ లో పెద్ద హీరోస్ సినిమాలు ఇప్పటిలో లేకపోవడంతో ఇలా వరస సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్.

త్రివిక్రమ్ తో కలసి….

ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన వెంటనే దిల్ రాజు బ్యానర్ లో ‘ఐకాన్‌’ చేయనున్నాడు. ఇది షూటింగ్ దశలో ఉండగానే సుకుమార్ సినిమా చేయనున్నాడు. ఇంకా డేట్స్ ఉంటే మాస్ డైరెక్టర్ బోయపాటి తో మళ్లీ గీతా ఆర్ట్స్‌లో ఒక మాస్‌ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నాడు. వచ్చే ఏడాది త్రివిక్రమ్ సినిమాతో పాటు మూడు సినిమాలు రిలీజ్ చేసే ఆలోచనలో బన్నీ ఉన్నట్టు సమాచారం. ఒకేవేళ ఆలా రిలీజ్ కాకపోతే సంక్రాంతి నుంచి సంక్రాంతికి మూడు సినిమాలు రావడమయితే ఖాయం.

Tags:    

Similar News