డిఫరెంట్ టైటిల్ తో అల్లు అర్జున్ సినిమా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో సినిమా రానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. [more]

Update: 2019-04-08 06:58 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో సినిమా రానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాధమ్ వంటి భారీ సూపర్ హిట్స్ వీరి కాంబినేషన్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు మరోసారి అద్భుతమైన కథ, కథనం, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంసీఏ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి “ఐకాన్” కనబడుట లేదు అనే విభిన్నమైన టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సదరన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

Tags:    

Similar News