ఇంత అందాన్ని పెళ్లి చేసుకున్నానా..!

Update: 2018-07-25 08:31 GMT

అల్లు అర్జున్ ప్రేమించి మరీ స్నేహ రెడ్డి ని పెళ్లాడాడు. ఆ దంపతులకు.. అయాన్, అర్హ లు కూడా జన్మించారు. అందమైన భార్యను తెచ్చుకున్న అల్లు అర్జున్ సినిమాల షూటింగ్ గ్యాప్స్ లో ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేస్తాడు. ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా తర్వాత ఫ్యామిలీ వెకేషన్ పూర్తి చేసిన అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక చిలిపి పని చేసాడు. అదేమిటంటే తన భార్య స్నేహ అందమైన ఫొటోని ఒకదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దానికి క్యాప్షన్ గా ఓ మై గాడ్‌.. ఇంత అంద‌మైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా... నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను... అంటూ సరదాగా కామెంట్ చేసాడు.

వైరల్ గా మారుతోన్న ఫోటోలు...

మరి అల్లు అర్జున్ చెప్పడం కాదు కానీ.. స్నేహ అచ్చం ఒక హీరోయిన్ లా కనబడుతుంది. అందమైన డిజైనర్ వెర్ లో స్నేహకి ఇద్దరు పిల్లలున్నారంటే నమ్మశక్యం కాదు. అంత అందంగా, నాజూగ్గా ఉంది. మరి ఆయన్, అర్హలు పుట్టిన తర్వాత కూడా స్నేహ తన అందాన్ని ఇలా మెయింటెయిన్ చెయ్యడం గొప్ప విషయమే. అందుకే అల్లు అర్జున్ పడిపోయాడు. పెళ్లై ఇన్నేళ్లయినా... ఇంత అందమైన భార్యను పెళ్లి చేసుకున్నందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇక మరో ఫొటోలో అల్లు స్నేహ తన ఇద్దరి పిల్లలతో దిగింది. ఆయన్, అర్హలు ఆ ఫోటో లో తల్లిని పెనవేసుకుని క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్నారు. మరి అర్హ అయితే బబ్లీగా కనబడుతూ ముద్దొచ్చేస్తోంది. ఇక ఆయన్ అయితే తింగరి తింగరిగా చూస్తూ తల్లిని పట్టుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మీరు చూసి ఆనందించండి.

Similar News