ఏపీ జనాలకి కోపం వచ్చేలా బన్నీ వ్యాఖ్యలు

Update: 2018-04-06 07:42 GMT

అల్లు అర్జున్ కి స్టార్ డమ్ కొత్త ఏమి కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ తన సినిమాలకు డిమాండ్ సంపాదించుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ పేరిట రికార్డు కూడా ఉంది. అలానే అల్లు అర్జున్ వివాదాల్లో చిక్కుకోవడం కొత్త ఏమి కాదు. చాలా సార్లు తనకి అనవసరం ఐన మ్యాటర్స్ లో చిక్కుకోవడం చూశాం.

గతంలో సరైనోడు సక్సెస్ మీట్ అప్పుడు ఫ్యాన్స్ పవన్ గురించి చెప్పండి అన్నప్పుడు సైలెంట్ గా ఉంటే సరిపోయేది కానీ అల్లు అర్జున్ " నేను చెప్పను బ్రదర్" అంటూ ఆన్సర్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని చాలా డ్యామేజ్ చేసినట్టు అయింది. అలానే ఇప్పుడు మరోసారి ఏకంగా ఏపీ జనాలకు అందరికీ మండుకొచ్చేలా మాట్లాడాడు. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ నాకు మోడీ పెద్ద స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు.

దీంతో ఆంధ్ర ప్రదేశ్ జనాలకి అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు. ఏడాది వరకు మోడీ అంటే అందరికి ఇష్టమే కానీ స్పెషల్ స్టేటస్ విషయంలో ఏపీ ప్రజలు అంత మోడీకి వ్యతిరెకంగా నిరసనలు చేస్తున్న టైంలో అల్లు అర్జున్ ఇలా అనడం సరి కాదని ఏపీ ప్రజలు అంటున్నారు. ప్రజలకి ఇబ్బందిగా ఉండే మ్యాటర్స్ లో బన్నీ తలదూర్చకుండా ఉంటే బాగుంటది అని కామెంట్స్ చేస్తున్నారు.

Similar News