శిరీష్ విషయంలో యంగ్ డైరెక్టర్ భలే నిర్ణయం తీసుకున్నారు

గీత ఆర్ట్స్ లో అల్లు అర్జున్ తో వర్క్ చేయాలంటే యువ దర్శకులు అల్లు అర్జున్ కంటే ముందు అల్లు శిరీష్ తో సినిమా తీసి నిర్మాతలని, [more]

Update: 2019-06-01 11:36 GMT

గీత ఆర్ట్స్ లో అల్లు అర్జున్ తో వర్క్ చేయాలంటే యువ దర్శకులు అల్లు అర్జున్ కంటే ముందు అల్లు శిరీష్ తో సినిమా తీసి నిర్మాతలని, అల్లు అర్జున్ మెప్పించిన తరువాతే అల్లు అర్జున్ తో మూవీ చేసేందుకు ఛాన్స్ ఇస్తున్నారు. మారుతి, పరశురామ్‌ అలా అల్లు శిరీష్‌తో పనిచేసిన వారే.

అయితే ఇప్పుడు యువ దర్శకులకి కూడా వాయిస్ రావడంతో అల్లు శిరీష్‌తో సినిమా చేయాలనే కండిషన్‌కి డైరెక్టర్స్‌ అంగీకరించడం లేదు. అతనితో చాలామంది డైరెక్టర్స్ పని చేసినప్పటికీ ఇంతవరకు సరైన హిట్ అందుకోలేదు శిరీష్. సో ఇతనితో అదృష్టం పరీక్షించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మన యంగ్ డైరెక్టర్స్.

అల్లు శిరీష్ వరసగా సక్సెస్‌ఫుల్‌ దర్శకులతో పనిచేసినా… అతనికి దర్శకులు దొరక్కపోవడంతో ఏబిసిడిని కొత్త దర్శకుడితో చేసాడు. ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయింది. మరి తన నెక్స్ట్ మూవీ కోసం దర్శకుడు దొరుకుతాడా? లేదో చూడాలి. ఎంత డబ్బు పెట్టిన ఏమి లాభం సరైన డైరెక్టర్ లేకపోతే.

Tags:    

Similar News