ఒక్కసారిగా హడావిడి తగ్గించారే

అల వైకుంఠపురములో పోస్టర్స్ కానీ, సాంగ్స్ ని కానీ చాలా ఎర్లీ గా అంటే సినిమా విడుదలకు మూడు నెలల ముందే ఒక్కొక్కటిగా వదులుతూ సినిమా మీద [more]

Update: 2019-11-30 09:53 GMT

అల వైకుంఠపురములో పోస్టర్స్ కానీ, సాంగ్స్ ని కానీ చాలా ఎర్లీ గా అంటే సినిమా విడుదలకు మూడు నెలల ముందే ఒక్కొక్కటిగా వదులుతూ సినిమా మీద అల్లు అర్జున్ – త్రివిక్రమ్ లు బజ్ తో పటు క్రేజ్ కూడా పెంచేశారు. రెండే రెండు పాటలు అల వైకుంఠపురములో సినిమాని ఆకాశంలో నిలబెట్టాయి. సామజవరాగమనా, రాములో రాముల పాటలు ఒకదాని మీద ఒకటి పోటీ పడి మరీ క్రేజ్ సంపాదించాయి. అయితే నిన్నమొన్నటివరకు తెగ హడావిడి చేసిన అల వైకుంఠపురములో టీం ఇప్పుడు సైలెంట్ అయ్యింది. ఆలా టీజర్ డిసెంబర్ ఫస్ట్ అంటూ ప్రచారం జరిగినా యూనిట్ నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

అయితే ఇప్పటివరకు క్రేజ్ పెంచింది చాలు.. ఇక అంతగా క్రేజ్ పెంచాల్సిన అవసరం లేదు… బిజినెస్ కూడా ఆలా సాంగ్స్ తో భారీగానే మొదలైంది.. అందుకే ఇప్పటినుండి సినిమా షూటింగ్ అండ్ ప్రొడక్షన్ మీద టైం స్పెండ్ చేసి.. సక్రమంగా సినిమాని విడుదల చెయ్యాలని త్రివిక్రమ్ అండ్ నిర్మాతలు భావిస్తున్నారట. ఇక టీజర్ ని రేపు కానీ… డిసెంబర్ 3 న కానీ విడుదల చేద్దామని, ట్రైలర్ రిలీజ్ ని కాస్త గ్రాండ్ గా చేసి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓ రేంజ్ లో చెయ్యాలని భావిస్తున్నారట.

Tags:    

Similar News