ఇలా అయితే అలా ని తట్టుకోవడం కష్టమే

సంక్రాతి రిలీజ్ మూవీ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటంటే.. అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరూ. ఈ రెండు సినిమాల మీద బోలెడంత [more]

Update: 2019-12-03 05:44 GMT

సంక్రాతి రిలీజ్ మూవీ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటంటే.. అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరూ. ఈ రెండు సినిమాల మీద బోలెడంత ఆసక్తి క్రేజ్ ఉన్నాయి. ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలు ఈ రెండే. ఇప్పటికే అలా వైకుంఠపురములో సాంగ్స్ ఓ ఊపు ఊపడం కాదు… సంచలనాలకు నెలవుగా మారాయి. మహేష్ ఊరుకుంటాడా మండే సరిలేరు నీకెవ్వరూ మైండ్ బ్లోయింగ్ సందడి అంటూ… ఫస్ట్ మండే సరిలేరు మాస్ బీట్ మైండ్ బ్లోయింగ్ సాంగ్ ని వదిలింది. దేవిశ్రీ మ్యూజిక్ అందించిన సరిలేరు మైండ్ బ్లోయింగ్ సాంగ్ మైండ్ బ్లాంక్ అయ్యేలా లేకపోయినా.. కాస్తంత మాస్ కి ఎక్కేలాగే కనబడుతుంది.

కాకపోతే అలా వైకుంఠపురలో సాంగ్స్ కి పోటీ ఇచ్చేంత కాదనిపిస్తుంది. దేవిశ్రీ మాస్ సాంగ్ అదే ఐటెం సాంగ్ ని ఓ రేంజ్ లో కిక్కించేలా మ్యూజిక్ ఇస్తాడు. కానీ సరిలేరు ఈ మాస్ బీట్ అంతలాంటి కిక్కేంచిదిగా మాత్రం లేదు. అల వైకుంఠపురములో పాటలతో ఒత్తిడికి లోనైనా దేవిశ్రీ అంచనాలను ఈ మైండ్ బ్లోయింగ్ సాంగ్ తో అందుకోలేకపోయిదనే చెప్పాలి. అలా వైకుంఠపురములో సాంగ్స్ ఆకాశంలో ఉంటె…. సరిలేరు ఈ మాస్ బీట్ మాత్రం మధ్యలో వేలాడుతుంది. మరి దేవిశ్రీ సరిలేరు కి యావరేజ్ ఆల్బమ్ ఇచ్చేలాగా ఉన్నాడని ఈ సాంగ్ వింటే అనిపిస్తుంది. సరిలేరు సాంగ్స్ ని అలా వైకుంఠానికి చుక్కలు చూపించేలా ఉంటాయనుకుంటే.. మొదటి సాంగ్ కే దేవిశ్రీ నీరుగార్చేయడం మహేష్ ఫ్యాన్స్ కి మింగుడు పడడం లేదు.

Tags:    

Similar News