సరిలేరు ని తట్టుకుని.. ఓపెనింగ్స్ సాధించిన అల్లు అర్జున్

మహేష్ బాబు ఓ పక్క సరిలేరు నీకెవ్వరూ అంటూ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించడం…. అలా మహేష్ మ్యానియా నడుస్తుండగానే.. సైలెంట్ గా అల్లు అర్జున్ అల [more]

Update: 2020-01-13 10:38 GMT

మహేష్ బాబు ఓ పక్క సరిలేరు నీకెవ్వరూ అంటూ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించడం…. అలా మహేష్ మ్యానియా నడుస్తుండగానే.. సైలెంట్ గా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో రావడం.. సరిలేరు నీకెవ్వరూ ప్రభంజాన్ని తట్టుకుని అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మంచి ఓపెనింగ్స్ రాబట్టడం మాత్రం చెప్పుకోదగ్గ పరిణామమే. అల్లు అర్జున్ క్రేజ్, త్రివిక్రమ్ మ్యానియా తో అల వైకుంఠపురములో సినిమా మొదటి షోకే హిట్ టాక్ రావడం… సినిమా మీద అప్పటికే ఉన్న అంచనాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అల వైకుంఠపురములో 26.76 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. మరి సరిలేరు నీకెవ్వరుతో పోటీపడిన అల వైకుంఠపురములో.. సరిలేరు క్రేజ్ ని తట్టుకుని 26 కోట్లు కొల్లగొట్టడం మాత్రం మాటలు కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 6.00
సీడెడ్ 3.74
నెల్లూరు 1.32
కృష్ణ 3.10
గుంటూరు 3.41
వైజాగ్ 2.87
ఈస్ట్ గోదావరి 3.54
వెస్ట్ గోదావరి 2.78

1ST డే ఏపీ & టీస్ షేర్: 26.76 కోట్లు

Tags:    

Similar News