అలా మహేష్ కి చెక్ పెట్టాడు… ఇక?

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రికార్డుల మోత ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గత ఏడాది ఎఫ్ 2 అలా దూసుకుపోతే.. ఈ ఏడాది సంక్రాంతికి అల్లు [more]

Update: 2020-01-28 07:24 GMT

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రికార్డుల మోత ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గత ఏడాది ఎఫ్ 2 అలా దూసుకుపోతే.. ఈ ఏడాది సంక్రాంతికి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్ కన్నా భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ క్రేజ్, భారీ బిజినెస్ చేసిన ఉన్న సరిలేరు నీకెవ్వరూ సినిమా కలెక్షన్స్ తో పోలిస్తే… అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కలెక్షన్స్ రేజింగ్ లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… ఓవర్సీస్ లోను అల వైకుంఠపురములో హావ కొనసాగుతుంది. అక్కడైతే మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాకి ఎప్పుడో చెక్ పెట్టిన అల్లు అర్జున్ తాజాగా మహేష్ మరో సినిమా కలెక్షన్స్ కి ఎసరు పెట్టాడు.

ప్రస్తుతం ఓవర్సీస్ లో టాప్ 5 లోకొచ్చిన అల వైకుంఠపురములో.. తాజాగా మహేష్ భరత్ అనే నేను కలెక్షన్స్ దాటుకుని టాప్ 4 సీటు కన్ఫర్మ్ చేసుకుంది. సరిలేరుకి సైలెంట్ గా చెక్ పెట్టిన అల్లు అర్జున్ భరత్ అనే నేను కి వైలెంట్ గా చెక్ పెట్టేసాడు. మహేష్ కి మాత్రమే ఓవర్సీస్ లో చుక్కలు చూపెట్టలేదు అల్లు అర్జున్. అల్లు అర్జున్ బావ రామ్ చరణ్ కి కూడా చెక్ పెట్టడానికి రెడీ అయ్యాడు. రామ్ చరణ్ రంగస్థలం.. బాహుబలి సీరీస్ తర్వాత ఓవరీసీ లో నెంబర్ 3 లో ఉంటే.. ఇప్పుడు ఆ నెంబర్ 3 పొజిషన్ కి అల వైకుంఠపురములో అల్లు అర్జున్ చేరుకునేలా ఉన్నాయి అల కలెక్షన్స్

Tags:    

Similar News