అలా ఆగడం లేదుగా

విడుదలైంది మొదలు అలా వైకుంఠపురములో థియేటర్స్ లో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ క్రేజ్ కాదు.. అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్న జనాలు అలా వైకుంఠపురములో అంటూ [more]

Update: 2020-01-22 05:56 GMT

విడుదలైంది మొదలు అలా వైకుంఠపురములో థియేటర్స్ లో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ క్రేజ్ కాదు.. అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్న జనాలు అలా వైకుంఠపురములో అంటూ ఇప్పటికి థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. ఫస్ట్ వీక్ లోనే దంచి కొట్టిన అలా వైకుంఠపురములో.. రెండో వారంలోను ఎక్కడా తగ్గడం లేదు. సెకండ్ వీకెండ్ లోను అలా వైకుంఠపురములో కలెక్షన్స్ అదిరిపోగా.. సెకండ్ వీక్ సోమ, మంగళవారాల్లో 50 నుండి 70 శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీ కనబడుతుంది అంటే.. అలా ఎక్కడా ఆగడం లేదనిపిస్తుంది. ఇప్పటికి బుక్ మై షోలో టికెట్స్ హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి.

మరోపక్క సరిలేరు నీకెవ్వరూ థియేటర్స్ లో ప్రేక్షకులు డల్ అయ్యారు. మహేష్ సరిలేరు నీకెవ్వరూ ఎంతగా హిట్ అన్నప్పటికీ.. రిపీటెడ్ ఆడియన్స్ ఆ సినిమాకి కరువయ్యారు. కాబట్టి అలా వైకుంఠపురములో కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. మరోపక్క అల్లు అర్జున్ హావా ఓవర్సీస్ లోను నడుస్తూనే ఉంది. అక్కడ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబడుతున్నాడు. మరోపక్క మహేష్ సరిలేరు నీకెవ్వరూ ఓవర్సీస్ లోను డల్ అయ్యింది. మరి రెండో వారం కింగ్ అలా వైకుంఠపురములోనే.. ఇది ఫిక్స్.

Tags:    

Similar News