మహేష్ ని వదలడా?

సంక్రాతి బరిలో ఉన్న మహేష్ బాబు, అల్లు అర్జున్ లు ఒకరి మీద ఒకరు పోటీపడుతున్నప్పటికీ… మహేష్ మీద ఒక అడుగు, పై చెయ్యి సాధిస్తూ అల్లు [more]

Update: 2019-11-21 04:15 GMT

సంక్రాతి బరిలో ఉన్న మహేష్ బాబు, అల్లు అర్జున్ లు ఒకరి మీద ఒకరు పోటీపడుతున్నప్పటికీ… మహేష్ మీద ఒక అడుగు, పై చెయ్యి సాధిస్తూ అల్లు అర్జున్, మహేష్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అల్లు అర్జున్ ఓ ప్రమోషన్ స్ట్రాటజీని మైంటైన్ చేస్తూ తన అల వైకుంఠపురములో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసుకున్నాడు. అల వైకుంఠపురములో రెండు సాంగ్స్ మార్కెట్ ని ఊపేస్తున్నాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా సాంగ్స్ వదలకపోయినా…. డైరెక్ట్ గా సరిలేరు టీజర్ తో అల్లు అర్జున్ కి దడ పుట్టించాలని మహేష్ టీం రెడీ అయ్యి నవంబర్ 22 న సరిలేరు టీజర్ రిలీజ్ అంటూ ప్రకటించింది.

పాటల్తోనే హోరెత్తిస్తున్న అల్లు అర్జున్ ఊరుకుంటాడా… అందుకే మహేష్ ని వదలను అంటూ సరిలేరు నీకెవ్వరూ టీజర్ విడుదల డేట్ కి అల వైకుంఠపురములో OMG డాడీ ఫుల్ సాంగ్ వదలబోతుననట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. OMG డాడీ సాంగ్ టీజర్ ని తన పిల్లలు అల్లు అయాన్, అర్హల్తో వీడియో ఎడిట్ చేసి ఆ సాంగ్ పై భారీ హైప్ పెంచిన అల్లు అర్జున్ ఇపుడు ఆ పాట ఫుల్ సాంగ్ వదలబోతున్నాడు. మరి మహేష్ ని అల్లు అర్జున్ ని నీడలా వెంటాడుతున్నాడు. సరిలేరు నీకెవ్వరూ టీజర్ రోజునే అల వైకుంఠపురములో సాంగ్ వదిలి ఎవరికీ ఎక్కువ లైక్స్, వ్యూస్ వచ్చాయో అనే దాని మీద ఓ టాపిక్ లేవనెత్తడానికి అల్లు అర్జున్ రెడీ అయ్యాడన్నమాట.

Tags:    

Similar News