చాలా నెలల గ్యాప్ తరువాత బన్నీ మళ్లీ…!

నా పేరు సూర్య తరువాత బన్నీ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ కోసం వేచి చూడటం వల్ల లేట్ [more]

Update: 2019-04-24 08:55 GMT

నా పేరు సూర్య తరువాత బన్నీ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ కోసం వేచి చూడటం వల్ల లేట్ అయ్యింది. చివరికి బన్నీ అనుకున్న డైరెక్టర్, స్క్రిప్ట్ దొరికేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ మూడోసారి నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక ఈ రోజు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ లైన్స్ లో తొలి షెడ్యూల్ షూటింగును ఆరంభించారు.

హ్యాట్రిక్ కొడతారా..?

ఇక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రకరించనున్నారు. గీతా ఆర్ట్స్ – హారిక హాసిని వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోసారి పూజా హెగ్డే అల్లు అర్జున్ సరసన నటించబోతుంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరువాత వస్తున్న చిత్రం కాబట్టి మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ముఖ్య పాత్రల్లో టబు, బొమన్ ఇరాని, జయరామ్, సుశాంత్, నవదీప్ కనిపించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే టైటిల్ పై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News