అల్లు అరవింద్ కన్ను ఆ సినిమాపై పడిందే..!

స్ట్రెయిట్‌ చిత్రాల విషయంలోనే కాదు… పరభాషా రీమేక్‌లు, డబ్బింగ్‌ల విషయంలో కూడా ఆచితూచి ఎంపిక చేసుకునే జీనియస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌. 2005లో మురుగదాస్‌ అజిత్‌కి చెప్పిన [more]

Update: 2019-01-16 10:40 GMT

స్ట్రెయిట్‌ చిత్రాల విషయంలోనే కాదు… పరభాషా రీమేక్‌లు, డబ్బింగ్‌ల విషయంలో కూడా ఆచితూచి ఎంపిక చేసుకునే జీనియస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌. 2005లో మురుగదాస్‌ అజిత్‌కి చెప్పిన ‘గజిని’ని తను చేయలేకపోయాడు. దీంతో అదే సబ్జెక్ట్‌ ని సూర్య హీరోగా తీసి బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుని మురుగదాస్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇదే చిత్రంలోని సరికొత్తదనాన్ని కనిపెట్టిన అల్లు అరవింద్‌ తెలుగులో దానిని రీమేక్‌ చేస్తే ఫీల్‌ మిస్‌ అవుతుందని గ్రహించి తెలుగులో డబ్‌ చేశాడు. ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో, మురుగదాస్‌కి, సూర్యకి తెలుగులో ఎంతటి స్టార్‌ ఫాలోయింగ్‌ని తీసుకుని వచ్చిందో తెలిసిందే. అదే సమయంలో అరవింద్ దీని బాలీవుడ్‌ రీమేక్‌ రైట్స్‌ ని తీసుకున్నాడు. తెలుగులో మాత్రం డబ్‌ చేసిన ఆయన హిందీలో మాత్రం మురుగదాస్‌ దర్శకత్వంలోనే అమీర్‌ ఖాన్‌ హీరోగా రీమేక్‌ చేశాడు. ఈ మూవీ తొట్టతొలి 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా కాసుల వర్షం కురిపించింది.

సీక్వెలా.. కొత్త కథతోనా..?

తాజాగా అల్లు అరవింద్‌ తన గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ‘గజిని 2’ అనే టైటిల్‌ని రిజిస్టర్‌ చేయించాడు. అల్లు అరవింద్‌ టైటిల్‌ రిజిష్టర్‌ చేయించాడంటే దానిని ఈజీగా తీసి పారేయలేం. మరి ఇది సీక్వెలా..? లేదా సరికొత్త కథతో రూపొందుతుందా..? మురుగదాసే దర్శకత్వం వహిస్తాడా..? అనేవి అఫీషియల్‌గా అనౌన్స్‌ మెంట్‌ వస్తే గానీ తెలియదు. మరోవైపు మురుగదాస్‌ తన తదుపరి చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రజనీకాంత్‌తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయినా తమిళంలో రూపొందిన ‘గజిని’ని మొదట తమిళంలో కాకుండా తెలుగులో తన సొంత బ్యానర్‌లో అల్లు రిజిస్టర్‌ చేయడంతో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మంచి చిత్రాలను నిర్మించడమే కాదు.. దానిపై టైటిల్‌ రిజిస్టర్‌ నుంచే చర్చ రేకెత్తించేలా చేయడంలో అల్లు సిద్దహస్తుడు. మరి అల్లు అశించిందే ప్రస్తుతం జరుగుతోంది. మరి ఈ చిత్రంపై పూర్తి వివరాలు అందే వరకు అంతా సస్పెన్సేనని చెప్పాలి..!

Tags:    

Similar News