అల్లు వారింటిలో సైరా టీం కు పార్టీ

అల్లు అరవింద్ కు తెలుగులో ఏదన్నా సినిమా నచ్చితే వెంటనే ఆ టీంని తన ఇంటికి పిలిచి వారిని సత్కరించడం, పార్టీ ఇవ్వడం చేస్తుంటారు. టీం అందరికి [more]

Update: 2019-10-04 08:23 GMT

అల్లు అరవింద్ కు తెలుగులో ఏదన్నా సినిమా నచ్చితే వెంటనే ఆ టీంని తన ఇంటికి పిలిచి వారిని సత్కరించడం, పార్టీ ఇవ్వడం చేస్తుంటారు. టీం అందరికి ఇంటికి పిలిచి పార్టీ ఇవ్వడం మనం చాలా సందర్భాల్లో చూశాం. ఆ మధ్య మహానటి సినిమా విషయంలో ఇదే చేశారు. ఇప్పుడు తమ సొంత సినిమా అయిన సైరా సక్సెస్ అవ్వడంతో అల్లు అరవింద్ సైరా టీం అందరితో పాటు మరికొంత మంది బయటి వ్యక్తులని ఇంటికి పిలిచి వారికి డిన్నర్ పార్టీ ఇచ్చాడు.

సక్సెస్ సందడి….

ఈ పార్టీకి చిరంజీవి తో పాటు సురేఖ, అల్లు అరవింద్, రాం చరణ్, అల్లు అర్జున్, అఖిల్ అక్కినేని, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రత్నవేలు, శ్రీకాంత్, సుష్మిత, పరుచూరి బ్రదర్స్, బొర్రా సాయి మాధవ్, గంట శ్రీనివాసరావు, అల్లు శిరీష్, సురేందర్ రెడ్డి, దిల్ రాజు, హరీష్ శంకర్, యూ వి వంశీ, విక్రమ్, వాసు వర్మ, డాక్టర్ వెంకటేశ్వరావు, మెహర్ రమేష్, కేఎస్ రామారావు, జెమిని కిరణ్ తదితరులు హాజరయ్యారు. సైరా సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్న మెగా క్యాంప్ కు ఇంతకు మించి ఏమి కావాలి? ఇక నిన్న అల్లు అర్జున్ తన ఫామిలీ తో కలిసి ఎఎమ్బీ మాల్ లో సైరా సినిమాను చూశారు.

 

Tags:    

Similar News