మ‌హేష్ చేతిలో న‌రేష్ ఫ్యూచ‌ర్‌..!

ఒకప్పుడు హీరోగా నటించి ఒకేసారిగా సైడ్ క్యారెక్టర్లు చేయాలంటే ఎవరికైన చాలా కష్టం. మరీ కెరీర్ పరంగా స్లోగా ఉన్నప్పుడు ఇటువంటివి చేస్తే పర్లేదు. అలా కాదని [more]

Update: 2019-05-08 07:46 GMT

ఒకప్పుడు హీరోగా నటించి ఒకేసారిగా సైడ్ క్యారెక్టర్లు చేయాలంటే ఎవరికైన చాలా కష్టం. మరీ కెరీర్ పరంగా స్లోగా ఉన్నప్పుడు ఇటువంటివి చేస్తే పర్లేదు. అలా కాదని హీరోగా మంచి లీడ్ చేస్తున్న టైంలో ఇటువంటివి చేస్తే కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఆల్రెడీ సైడ్ క్యారెక్టర్లకు, హీరో ఫ్రెండ్ పాత్రలు చేస్తున్నాడు. సునీల్ తరువాత అలా అల్లరి న‌రేష్ చేస్తున్నాడు. కమెడియన్ నుండి హీరోగా మారి చివరికి హీరోగా పనికిరాన‌ని అని అర్ధం చేసుకుని మళ్లీ కామెడీ పాత్రలు చేయడానికి వెన‌క్కి వచ్చిన సునీల్ లేటెస్ట్ గా అరవింద సమేతలో ఎన్టీఆర్ కు ఫ్రెండ్ గా నటించాడు.

హీరోగా ఫ్లాపులు వ‌స్తుండ‌టంతో…

ఆ తరువాత అలా చిత్రలహరి సినిమాలో కామెడీ పాత్రలు కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసాడు. ఇలా చేస్తున్నందుకు సునీల్ హ్యాపీ. మరీ అల్లరి నరేష్ పరిస్థితి ఏంటి? అల్లరి నరేష్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. హీరోగా ఫ్లాపులు వస్తున్న వేళ వంశీ పైడిపల్లి ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ చెప్పే సరికి ఒప్పుకున్నాడు.పైగా మహేష్ బాబుతో సినిమా కాబట్టి వెంటనే ఓకే చెప్పేసాడు. ఈ సినిమాతో అర్థం అవుతుంది నరేష్ కి హీరోగా కంటిన్యూ అవ్వాలా లేదా క్యారెక్టర్ రోల్స్ చేయాలా అనే విషయం. చూద్దాం ఏమైతుందో.

Tags:    

Similar News