ప్లాప్ హీరోయిన్స్ ఆశలు గల్లంతయ్యే

ఈ ఏడాది కరోనా మహమ్మారి వలన సినిమా ఇండస్ట్రీ ఎన్నో వేల కోట్ల నష్టాల పాలైంది. సెట్స్ మీదున్న సినిమాలు, విడుదలకు నోచుకోని సినిమాలు, థియేటర్స్ బంద్, [more]

Update: 2020-09-19 07:24 GMT

ఈ ఏడాది కరోనా మహమ్మారి వలన సినిమా ఇండస్ట్రీ ఎన్నో వేల కోట్ల నష్టాల పాలైంది. సెట్స్ మీదున్న సినిమాలు, విడుదలకు నోచుకోని సినిమాలు, థియేటర్స్ బంద్, సినిమా కార్మికుల ఆకలి కేకలు అబ్బో సినిమా ఇండస్ట్రీ ని కరోనా అతలాకుతలం చేసేసింది. నిర్మాతలు ఘొల్లుమంటుంటే.. ప్లాప్ హిరోయిన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన అవార్డ్స్ ఫంక్షన్స్ అన్ని కరోనా కారణంగా క్యాన్సిల్ అయ్యాయి. బాలీవుడ్ నుండి హాలీవుడ్ దాక కోలీవుడ్ నుండి టాలీవుడ్ దాక జరగాల్సిన అవార్డ్స్ వేడుకలన్నీ కరోనా కారణంగానే మిస్ అయ్యాయి. మరి ప్లాప్స్ లో ఉన్న హీరోయిన్స్ చాలామంది ఈ అవార్డ్స్ వేడుకలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. ఆ వేడులకి స్టైలిష్ గా తయారై వెళ్ళడానికి ఒక కారణమైతే. స్టేజ్ డాన్స్ లతోనే దర్శకనిర్మాతలని ఆకట్టుకోవాలని చూస్తుంటారు.

ప్రతి హీరోయిన్ అందమైన డ్రెస్ తో, చాలా స్టైలిష్ హెయిర్ స్టైల్, హాట్ హాట్ అందాలతో ఫోటో గ్రాఫేర్స్ కి ఫోజులిస్తూ.. స్టేజ్ మీద ఆడుతూ పడుతూ అందరిని మైమరపించే హీరోయిన్స్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. ఈ ఏడాది కరోనా కారణముగా జరగాల్సిన ఫిలిం ఫేర్ అవార్డ్స్, ఆగష్టు లో జరగాల్సిన సంతోషం అవార్డ్స్, సైమా అవార్డ్స్, విజయ్ అవార్డ్స్, టివి 9 – టీఎస్ఆర్ అవార్డ్స్, జీ సినీ అవార్డ్స్ అబ్బో చాలా అవార్డులు క్యాన్సిల్ అయ్యాయి. అయితే తాజాగా సైమా వారు షార్ట్ ఫిలిం అవార్డ్స్ కండక్ట్ చేస్తాం అని.. అతి త్వరలోనే అంటూ అనౌన్స్ చేస్తున్నారు. మరి కరోనా కారణముగా క్యాన్సిల్ అయినా అవార్డు వేడుకలు మల్లి మొదలైతే ప్లాప్ హీరోయిన్స్ ఇక పండగే.

Tags:    

Similar News