ఇలా చేస్తే లుక్ పై ఇంట్రెస్ట్ పోతుందేమో?

చాలామంది హీరోలు సినిమాల్లో ఎలాంటి లుక్ కనిపిస్తారో అనేది వాళ్ళ ఫస్ట్ లుక్ బయటికి వచ్చేవరకు తేలియనివ్వరు. కారణం ఫాన్స్ లోను, ప్రేక్షకుల్లోనూ తమ లుక్ పై [more]

Update: 2020-09-24 05:30 GMT

చాలామంది హీరోలు సినిమాల్లో ఎలాంటి లుక్ కనిపిస్తారో అనేది వాళ్ళ ఫస్ట్ లుక్ బయటికి వచ్చేవరకు తేలియనివ్వరు. కారణం ఫాన్స్ లోను, ప్రేక్షకుల్లోనూ తమ లుక్ పై క్యూరియాసిటీ ఉంటె.. బావుంటుంది అనే ఉద్దేశ్యంతోనే. అయితే అల్లు అర్జున్ మాత్రం అలా ఆలోచించడం లేదు. పుష్ప ఫస్ట్ లుక్ ఇచ్చేశాం కదా… ఇక లుక్ ని దాయడమెందుకు అనుకున్నాడేమో.. పుష్ప లుక్ నే గత ఐదారు నెలలుగా మైంటైన్ చేస్తున్న అల్లు అర్జున్ ఎప్పుడు బడితే అప్పుడు జనాల్లోకి వచ్చేస్తున్నాడు. పుష్ప సినిమా ఫస్ట్ లుక్ లోనే అల్లు అర్జున్ ఊరమాస్ గా ఉండబోతున్నాడని అర్ధమైంది. ఇక షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడడంతో అల్లు అర్జున్ మాత్రం పుష్ప లుక్ తోనే తిరుగుతూన్నాడు.

అలాగని ఇంట్లోనే ఉన్నాడా? అంటే అదీ లేదు. కొమరం భీం కేరెక్టర్ లో కనబడనున్న ఎన్టీఆర్ RRR లుక్ పై అందరిలో క్యూరియాసిటీ ఉంది. రాజమౌళి ఎప్పుడెప్పుడు లుక్ వదులుతాడా అని ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. ఇక ఎన్టీఆర్ కూడా కరోనా వచ్చాక బయటికి వచ్చింది లేదు. రామ్ చరణ్ అల్లూరి లుక్ బయటికిచ్చింది కాబట్టి అప్పుడప్పుడు బయటికి వస్తున్నాడు. కానీ అల్లు అర్జున్ పదే పదే పుష్ప మేకోవర్ లోనే దర్శనమిస్తుంటే.. ఇక సినిమాలో అల్లు అర్జున్ ని అలా చూసాక ఫాన్స్ కి ఏం ఇంట్రెస్ట్ కలుగుతుంది అని అంటున్నారు. మరి అల్లు అర్జున్ మాత్రం కరోనా కారణముగా అప్పుడప్పుడు వాకింగ్, జాగింగ్, లొకేషన్స్ అంటూ జనాల్లో తెగ తిరిగేస్తున్నాడు.

Tags:    

Similar News