#RRR బ్యూటీ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అంట..!

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న #RRR సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు క్యారెక్టర్ లో, ఎన్టీఆర్ [more]

Update: 2019-05-24 10:32 GMT

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న #RRR సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు క్యారెక్టర్ లో, ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ భారీ క్రేజున్న ప్రాజెక్ట్ లో అల్లూరి పాత్రధారి రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న అలియా భట్ ఇప్పుడు #RRR లో నటిస్తూ సౌత్ నుండి కూడా క్రేజీ హీరోయిన్ అనిపించుకుంటుంది.

అందరినీ వెనక్కునెట్టి

ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అలియా భట్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉన్న అలియా భట్ ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా గౌరవాన్ని అందుకుంది. బాలీవుడ్ లో టాప్ రేంజ్ హీరోయిన్స్ ని సైతం వెనక్కి నెట్టి మరీ ఇలాంటి గౌరవాన్ని అలియా భట్ సొంతం చేసుకుంది. మొత్తం 50 మందితో కూడిన ఈ జాబితాలో అలియా భట్ మొదటి స్థానం సొంతం చేసుకోగా తరువాత స్థానాల్లో మీనాక్షి చౌదరి, కత్రినా కైఫ్, దీపికా పదుకొనె, గాయత్రి భరద్వాజ్, అదితీరావు లాంటి వారు ఉన్నారు.

Tags:    

Similar News