అలియాతో సాంగ్ పాడిస్తా అంటున్న జక్కన్న?

బాలీవుడ్ లో దీపికా, ప్రియాంక చోప్రాల తర్వాత అంత క్రేజ్ ఉన్న నటి అలియా భట్. బాలీవుడ్ బడా సినిమాల్తో బిజీగా ఉండే అలియా భట్ ని [more]

Update: 2020-11-02 08:13 GMT

బాలీవుడ్ లో దీపికా, ప్రియాంక చోప్రాల తర్వాత అంత క్రేజ్ ఉన్న నటి అలియా భట్. బాలీవుడ్ బడా సినిమాల్తో బిజీగా ఉండే అలియా భట్ ని రాజమౌళి RRR కోసం అడగ్గానే రాజమౌళి డైరెక్షన్ లో ఎలాగైనా సినిమా చెయ్యాలనుకున్న అలియా RRR కి రెడీ అయ్యింది. మధ్యలో అలియా భట్ డేట్స్ అడ్జెస్ట్ కాలేదని, సుశాంత్ సింగ్ మరణంతో బాగా కార్నర్ అయినా అలియా RRR నుండి తప్పుకుందనే ప్రచారం జరిగినా…. ఆ వార్తలను జక్కన్న కొట్టిపారేశాడు. ఇక కరోనా తర్వాత RRR షూటింగ్ తాజాగా మొదలైంది. సీత కేరెక్టర్ చేస్తున్న అలియా భట్ నవంబర్ మొదటి వారంలోనే RRR సెట్స్ మీదకి రాబోతుంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అలియా భట్ సన్నివేశాల చిత్రీకరణ ను రాజమౌళి మొదలుపెట్టబోతున్నాడు.

RRR కోసం బల్క్ డేట్స్ కేటాయించిదట అలియా భట్. అయితే ఈ సినిమాలో అలియా భట్ కి రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి మధ్యన కీలక సన్నివేవాలు ఉంటాయని., అలాగే సీతగా ఓ పాటలో అలియా భట్ పెరఫార్మెన్స్ సినిమాకే హైలెట్ అంటుంటే.. ఆ పాటలో అలియా భట్ గొంతు సవరించనుందనేది లేటెస్ట్ న్యూస్. అలియా భట్ హీరోయిన్ మాత్రమే కాదు… గతంలో రెండు సినిమాల్లోకి సింగర్ గాను పాటలు పాడి పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు RRR లో కూడా అలియా భట్ తన గొంతు సవరించనుందని…. RRR పలు భాషల్లో తెరకెక్కుతుంది కాబట్టి.. అలియా కేవలం హిందీలో మాత్రమే ఆ పాట పాడనుందని.. తెలుగులో మాత్రం అలియా గొంతు సాంగ్ లో ఉండదని అంటున్నారు. మరి దర్శకుడు యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ తో పాట పాడించినట్లుగా ఇప్పుడు అలియా భట్ తో కూడా ఓ సాంగ్ కి ప్లాన్ చేస్తున్నాడేమో అంటున్నారు.

Tags:    

Similar News