చరణ్ హీరోయిన్ కావాలంటున్న బన్నీ!

ఏదైనా స్టార్ హీరో పక్కన చేస్తున్న హీరోయిన్ మీదే మరో స్టార్ హీరో కళ్ళుంటాయి. అంతేకాదు ఒక క్రేజ్ ఉన్న హీరోయిన్ చుట్టూనే స్టార్ హీరోలు పడుతుంటారు. [more]

Update: 2019-04-13 06:24 GMT

ఏదైనా స్టార్ హీరో పక్కన చేస్తున్న హీరోయిన్ మీదే మరో స్టార్ హీరో కళ్ళుంటాయి. అంతేకాదు ఒక క్రేజ్ ఉన్న హీరోయిన్ చుట్టూనే స్టార్ హీరోలు పడుతుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పూజ హెగ్డే నే. ఆమెకి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా… అల్లు అర్జున్ సరసన నటించింది కదా అని… ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ కూడా వెంటపడ్డారు. అలాగే మహేష్ తో భరత్ అనే నేను లో చేస్తుంది కదా అని కైరా అద్వానీని రామ్ చరణ్ తన వినయ విధేయరామాలో తీసుకున్నాడు. అదే కైరా అద్వానీపై అల్లు అర్జున్ కూడా కన్నేశాడు. కానీ వినయ విధేయరామతో ఆమె క్రేజ్ దెబ్బతినడంతో.. ఆమెకున్న క్రేజ్ చాలదని డ్రాపయ్యి.. మల్లి పూజ హెగ్డే నే ఫైనల్ చేసారు.

ఇక అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా నేడు మొదలుకానుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్, కేథరిన్ సెకండ్ హీరోయిన్. తాజాగా అల్లు అర్జున్ ఇప్పుడు తన బావ రామ్ చరణ్ హీరోయిన్ మీద కన్నెసినట్లుగా వార్తలొస్తున్నాయి. అది కూడా #RRR లో రామ్ చరణ్ పక్కన చెయ్యబోయే అలియా భట్ అయితే వేణు శ్రీ రామ్ సినిమాలో బావుంటుందని.. దిల్ రాజు తో అల్లు అర్జున్ చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. #RRR కోసం అలియాని రాజమౌళి అండ్ టీం భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చాడు. మరి అలియా భట్ క్రేజ్ అలాంటిది. మరి దిల్ రాజు అంత రెమ్యునరేషన్ అలియా భట్ కి పెడతాడా? అదేమో తెలియదు కానీ.. అల్లు అర్జున్ మాత్రం వేణు శ్రీ రామ్ తో చెయ్యబోయే సినిమాకి అలియా ని ట్రై చెయ్యమని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎలాగూ అల్లు అర్జున్ కి హిందీ యూట్యూబ్ కి మంచి క్రేజ్ ఉంది. అందుకే అలియా భట్ అయితే ఆ క్రేజ్ ని థియేట్రికల్ గా కూడా పెంచుకోవచ్చని బన్నీ ఆశ.

Tags:    

Similar News