బన్నీ కి ‘నో’ చెప్పిన బాలీవుడ్ హాట్ బ్యూటీ

అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ఐకాన్ అనే సినిమా రానుంది. ఈమూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాల టైం ఉంది. కానీ ఈలోపు [more]

Update: 2019-08-22 08:34 GMT

అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ఐకాన్ అనే సినిమా రానుంది. ఈమూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాల టైం ఉంది. కానీ ఈలోపు పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు నటీనటునులు వేట స్టార్ట్ చేసారు టీం. ఈనేపథ్యంలోనే బన్నీ సరసన నటించేందుకు ఒక రేంజ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ నుండి ఆలియాభట్ ని తీసుకోవాలని ట్రై చేసారు టీం.

అలియా నుండి నో అనే సమాధానం వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అలియా బాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ లేక నో చెప్పినట్టు టాక్. రీసెంట్ గా ఆమె రామ్ చరణ్ సరసన #RRR లో నటించిన సంగతి తెలిసిందే. బన్నీ కోరిక మీదకే ఆమెను సంప్రదించారు దిల్ రాజు అండ్ టీం. అయితే ఇప్పుడు వేరే ఆల్టర్ నేటివ్ చూస్తున్నారు.

కానీ ఎట్టిపరిస్థితుల్లో బన్నీ కి జోడిగా కొత్త గా ఉండే ఒక రేంజ్ హీరోయిన్ నే తీసుకోవాలని అనుకుంటున్నారు. త్రివిక్రమ్ సినిమాకి కూడా కొత్త హీరోయిన్ ని తీసుకుంద్దాం అనుకుని చివరికి పూజతో ఫిక్స్ అయ్యారు. కానీ దిల్ రాజు విషయం లో అలా చేయకూడదని బన్నీ తో పాటు దిల్ రాజు భావిస్తున్నాడు. మరి ఎవరి ని సంప్రదిస్తారో చూడాలి.

Tags:    

Similar News