వచ్చే సంక్రాంతి వారికి పరీక్షే

త్రివిక్రమ్ – బన్నీ లకు సంక్రాంతి లో రిలీజ్ అయ్యే ‘అల వైకుంఠపురములో’ సినిమా పెద్ద పరీక్ష గా మారింది. ఎందుకంటే గత ఏడాది త్రివిక్రమ్ సంక్రాంతి [more]

Update: 2019-09-23 08:39 GMT

త్రివిక్రమ్ – బన్నీ లకు సంక్రాంతి లో రిలీజ్ అయ్యే ‘అల వైకుంఠపురములో’ సినిమా పెద్ద పరీక్ష గా మారింది. ఎందుకంటే గత ఏడాది త్రివిక్రమ్ సంక్రాంతి సీజన్ లోనే పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ తీసి ఆ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో వెంటనే పొలిటికల్ వైపు వెళ్ళిపోయాడు. ఇప్పటిలో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేసే ఛాన్స్ లేదు. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ అయినప్పుడు ఆ సమయంలో త్రివిక్రమ్ పై మెగా ఫ్యాన్స్ అసహనం చూపించి గట్టిగానే విరుచుకుపడ్డారు.

సంక్రాంతికి పండగే…..

ఇవ్వన్ని మనసులో పెట్టుకుని త్రివిక్రమ్ వచ్చే ఏడాది సంక్రాంతికి తన సినిమా ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమాపై త్రివిక్రమ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మెగా ఫ్యాన్స్ కు ఈసినిమాతో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చూస్తున్నాడు. ‘అజ్ఞాతవాసి’తో అందుకోలేకపోయిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ ను ఈ సినిమాతో అందుకొని మళ్లీ పూర్వ వైభవం అందుకోవాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. అటు బన్నీ కూడా ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. బన్నీ సంక్రాంతి రేస్ లో వచ్చి హిట్ కొట్టి చాలా ఏళ్ళు అయిపోతుంది. అప్పుడెప్పుడో ‘దేశ ముదురు’ తో వచ్చి హిట్ కొట్టాడు. సో వీరిద్దరూ ఈ సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి సినిమా ను తీస్తున్నారు. మరి రిజల్ట్ ఏం అవుతుందో చూడాలి…

 

 

Tags:    

Similar News