పూజ అందాలతో ఎర వేస్తున్నారు

ఈ పండక్కి నాలుగు సినిమాలు దిగుతున్నాయి. వేటికవే వైవిధ్యభరితమైన సినిమాలు. రజినీకాంత్ దర్బార్.. మాస్ ఎంటెర్టైనెర్ గా, సరిలేరు నీకెవ్వరూ కామెడీ, యాక్షన్ మూవీగా, అల వైకుంఠపురములో [more]

Update: 2020-01-09 06:06 GMT

ఈ పండక్కి నాలుగు సినిమాలు దిగుతున్నాయి. వేటికవే వైవిధ్యభరితమైన సినిమాలు. రజినీకాంత్ దర్బార్.. మాస్ ఎంటెర్టైనెర్ గా, సరిలేరు నీకెవ్వరూ కామెడీ, యాక్షన్ మూవీగా, అల వైకుంఠపురములో కామెడీ ఎంటెర్టైనెర్ గా, ఎంత మంచి వాడవురా సినిమా కుటుంబ కథా చిత్రంగా వేటికవే విభిన్నకథలతో తెరకెక్కిన సినిమాలు. అయితే అన్నిటిలో సరిలేరు నీకెవ్వరూ – అల వైకుంఠపురములో సినిమాల మధ్యన గట్టి పోటీ వాతారవరణం కనబడుతుంది. అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమా ఒకరోజు ముందు రావడం.. ఆ సినిమా కాస్త కామెడీ, యాక్షన్ మిళితంగా కావడంతో.. కొద్దిగా హైప్ ఉంది. అందులోను సరిలేరు నీకెవ్వరూ ఈవెంట్ పెద్ద సక్సెస్ కావడంతో.. ఇప్పుడు అల వైకుంఠపురం ప్లాన్ మార్చింది.

అందుకే హీరోయిన్ పూజ అందాలను విరివిగా వాడేస్తున్నారు. మొదటినుండి అల టీం పూజ హెగ్డే ని హైలెట్ చేస్తూ రావడం, పాటల ప్రోమోస్ లోను పూజ అందాలను చూపించడం చేస్తూ -వస్తుంది. టీజర్ నుండి ట్రైలర్ వరకు పూజ హెగ్డే కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎలాగూ పూజ హెగ్డే అందంగా ఉంటుంది, అలాగే గ్లామరస్ గాను ఆకట్టుకుంది. అందుకే పూజ అందాలను ఎక్కువగా ఎర వేస్తున్నారు అనిపిస్తుంది. తాజాగా విడుదలైన బుట్ట బొమ్మ సాంగ్ లోను బన్నీ స్టైలిష్ డాన్స్ తో పాటుగా పూజ హెగ్డే అందాలు హైలెట్ అనేలా ఉన్నాయి. హీరోయిన్ల గ్లామర్ షోపై పెద్దగా ఫోకస్ చేయని త్రివిక్రమ్.. ఈమధ్యన మాత్రం బాగానే చూపిస్తున్నాడు. పూజాలోని అందాలను బాగానే హైలైట్ చేసాడు. ఇప్పటికే పూజ హెగ్డే పోస్టర్స్ లోనే బుల్లి గౌనులతో పిచ్చెక్కిస్తుంటే.. ఇప్పుడు హాట్ హాట్ అందలతో రెచ్చిపోతూ.. సినిమా ప్రమోషన్స్ లో భాగమవుతుంది.

Tags:    

Similar News