బుల్లితెర ని రఫ్ఫాడించిన బన్నీ?

ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఇప్పటికీ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూనే ఉన్న అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కి కెరీర్ లో [more]

Update: 2020-08-28 04:12 GMT

ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఇప్పటికీ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూనే ఉన్న అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కి కెరీర్ లో గుర్తుండిపోయే కిక్కిచ్చే హిట్ ఇచ్చింది. అల వైకుంఠపురములో సాంగ్స్ ఇంకా రికార్డులకు నెలవుగానే మారుతున్నాయి. త్రివిక్రమ్ బన్నీ కాంబో లో ఆల్ టైం రికార్డుగా మారిన అల వైకుంఠపురములో ఇప్పుడు బుల్లితెర ని రఫ్ఫాడించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాలను అలరించింది.

బాక్సాఫీసుని సునామీలా చుట్టేసిన అల వైకుంఠపురములో రెండు వారల క్రితం జెమినీ ఛానెల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమా బుల్లితెర మీద తెలుగు ఇండస్ట్రీలోనే కనీ వినీ ఎరుగని ఆల్ టైం టీఆర్పీ రికార్డును నెలకొల్పింది. అల వైకుంఠపురములో ప్రసారమైన జెమిని ఛానల్ కి ఏకంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సంపాదించి బుల్లితెరపైనా అల వైకుంఠపురములో తన సత్తా చూపెట్టింది. థియేటర్స్ లోను, సన్ నెస్ట్, నెట్ ఫ్లిక్స్ లోనే కాదు.. ఆఖరుకి బుల్లితెర మీద అల వైకుంఠపురములో ఎవరు అందుకోలేని రికార్డులను నెలకొల్పింది.

Tags:    

Similar News