అక్షయ్ అదరగొడుతున్నాడు..!

బాలీవుడ్ లో ఈ మూడు నెలల కాలంలో అక్షయ్ కుమార్ టాప్ లో కనిపిస్తున్నాడు. ఈ నెల 21న అక్షయ్ కుమార్ – పరిణీతి చోప్రా హీరో [more]

Update: 2019-03-25 07:23 GMT

బాలీవుడ్ లో ఈ మూడు నెలల కాలంలో అక్షయ్ కుమార్ టాప్ లో కనిపిస్తున్నాడు. ఈ నెల 21న అక్షయ్ కుమార్ – పరిణీతి చోప్రా హీరో హీరోయిన్స్ గా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన కేసరి సినిమా విడుదలైంది. ఆ సినిమా మొదటి రోజునే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కేసరి సినిమా అక్షరాలా మొదటి రోజున 21 కోట్లను కొల్లగొట్టి ఈ ఏడాది ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ వచ్చేసరికి కేసరి సినిమా 75 కోట్లను వసూలు చేసింది.

100 కోట్లు ఖాయం

మొదటి వారం గడవకముందే.. 100 కోట్లు కొల్లగొట్టేలా కనబడుతుంది. మరి 100 కోట్ల క్లబ్బులో కేసరి సినిమా నిలిచింది అంటే అక్షయ్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం బాలీవుడ్ లో సరైన సినిమా లేకపోవడం కేసరి సినిమాకి బాగా కలిసొచ్చింది. అందుకే ఈ సినిమాకి ఇలా కలెక్షన్స్ ప్రవాహం పెరిగిపోయింది. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో ఖాన్స్ త్రయం వరుసగా ఫెయిల్ అవడం ఇలా రణవీర్ సింగ్, అక్షయ్ లు మెల్లిగా పుంజుకోవడం మాత్రం బాలీవుడ్ కి మంచి రోజులు వచ్చినట్టే కనబడుతుంది.

Tags:    

Similar News