అక్షయ్ కి అవమానమా..?

Update: 2018-09-14 06:27 GMT

సాధారణంగా మన తెలుగు సినిమాల్లో మన హీరోలను తక్కువ చేసి చూపిస్తే మనం అసలు ఒప్పుకోము. అలానే బాలీవుడ్ లో కూడా అంతే. అక్షయ్ కుమార్ ని '2.0' టీజర్ లో కాకిలా చూపించారని అక్కడ ఫ్యాన్స్ శంకర్ పై విరుచుకుపడుతున్నారు. టీజర్ లో అక్షయ్ ని కాకిలా చూపించడం ఒక అభిమానికి నచ్చలేదు. దీంతో అతను "...అక్షయ్ కొ కాలా కౌవా బనాయా?" అంటూ ఫైర్ అయ్యాడు.

కొంత నిరాశ చెందిన ప్రేక్షకులు...

మరి నిన్న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన టీజర్ ఎలా ఉందంటే..టీజర్ ను చూసిన చాలామంది జనాలు ఇంకేదో ఎక్స్ పెక్ట్ చేశారు అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా మొదటి పార్ట్ అంతలా ప్రేక్షకులని ఆకట్టుకుంది. అయితే, ఓవర్ ప్రమోషన్స్.. విపరీతమైన హైప్.. బడ్జెట్ 540 కోట్ల అనడంతో '2.0' చిత్రం 'అవతార్' కు మించి ఉంటుంది అనుకోవడంతో కొంత నిరాశ చెందారు ప్రేక్షకులు. పైగా హిందీ వాళ్ల మేజర్ కంప్లైంట్ ఏంటంటే..హిందీ టీజర్ లో అక్షయ్ ని కేవలం ఒక సెకండ్ మాత్రం చూపించారని..మేకర్స్ కు హిందీ మార్కెట్ అవసరం లేదా అని..కంప్లైంట్స్ చేస్తున్నారు.

అక్షయ్ సీన్లు పెంచితే...

సూపర్ స్టార్ రజని సినిమా అంటే మేజర్ గా ఆయన్నే ఫోకస్ చేస్తారు కానీ అక్షయ్ ని ఫోకస్ చేయలేరుగా. అక్షయ్ మీద రజని పెద్ద స్టార్ అని తెలిసినా.. వారి ఫ్యాన్స్ కాబట్టి అవన్నీ వినరు కదా. కొంచం హిందీ ప్రేక్షకులు కోసం అక్షయ్ సీన్స్ కొన్ని ఎక్కువ ఉంటే హిందీలో టీజర్ రీచ్ బాగుండేదని చెబుతున్నారు. మరికొంతమంది ఏమో ఇది ఎప్పుడో లీకయిన టీజర్ కదా.. కొత్తేముంది అని అంటున్నారు. ఓ చిన్నపాటి టీజర్ లో అన్నీ చూపించాలంటే కష్టమే కాబట్టి సినిమాలో అక్షయ్ ను ఏ రేంజ్ లో శంకర్ చూపిస్తాడో అని ఎదురు చూడాల్సిందే. అప్పటివరకు మనం ఎన్ని మాట్లాడుకున్నా వేస్ట్ అని మరి కొంతమంది అంటున్నారు. కాబట్టి శంకర్ ఓ సారి అలోచించి హిందీ లో సరైన ప్రొమోషన్స్ చేస్తే అక్కడ రికవరీ అయ్యే అవకాశం ఉంది. లేదంటే కష్టమే.

Similar News