`మ‌న్మ‌థుడు 2` లో నాగ్ పాత్ర ఎలా ఉండబోతుంది అంటే?

కింగ్ నాగార్జున – రాహుల్ రవీంద్ర కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ [more]

Update: 2019-07-19 06:39 GMT

కింగ్ నాగార్జున – రాహుల్ రవీంద్ర కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న బిజీగా ఉన్న ఈసినిమా వచ్చే నెలలో రిలీజ్ అవ్వనుంది.

ఇక నాగ్ ఇందులో ఫుల్ లెంగ్త్ పాత్ర లో కనిపించనున్నారు. ఇందులో నాగ్ కామెడీ టైమింగ్ హైలైట్ గా ఉంటుందని టాక్. నాగ్ పాత్ర ఫుల్ కామెడీ గా ఉండబోతుందని చెబుతున్నారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్ర నాగ్ పాత్రను బాగా తీర్చిదిద్దారట. ఓ ముఖ్య పాత్రల్లో నాగ్ కోడలు సమంత మరియు కన్నడ బ్యూటీ అక్షరా గౌడ నటించారు.

ట్రైలర్ తో మంచి అంచనాలు పెంచుకున్న ‘మన్మథుడు 2’ ను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. ఇక ఈచిత్రాన్ని నాగార్జున అక్కినేని, పి. కిరణ్ సంయుక్తంగా నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు

Tags:    

Similar News