బిగ్ బాస్ ఫినిష్ బాస్.. ఏదో ఒకటి డిసైడ్ చెయ్

అక్కినేని నాగార్జున కి ఆఫీసర్ డిజాస్టర్ అయితే.., దేవదాస్ ప్లాప్ అయ్యింది. ఇక మన్మధుడు 2 అయితే డిజాస్టర్ కే డిజాస్టర్ అవడంతో… నాగార్జున తన తదుపరి [more]

Update: 2019-11-14 07:10 GMT

అక్కినేని నాగార్జున కి ఆఫీసర్ డిజాస్టర్ అయితే.., దేవదాస్ ప్లాప్ అయ్యింది. ఇక మన్మధుడు 2 అయితే డిజాస్టర్ కే డిజాస్టర్ అవడంతో… నాగార్జున తన తదుపరి చిత్రాన్ని మొదలెట్టడానికి బోలెడంత సమయం తీసుకుంటున్నాడు. అయితే మధ్యలో బిగ్ బాస్ హడావుడితో ఉన్న నాగార్జునకి బిగ్ బాస్ హడావిడి కూడా ఈ నెల మొదటివారం లోనే ముగియడంతో.. నాగార్జున తదుపరి చిత్ర అప్ డేట్ కోసం ఆయన అభిమానులు ఎదురు చేసూటున్నారు. బిగ్ బాస్ జరుగుతున్నప్పుడు అనారోగ్యం పాలైన నాగార్జున ఇప్పుడు కోలుకుని తన తర్వాతి చిత్రం కోసం ఆలోచిస్తున్నాడట.

నాగార్జున తనకిష్టమైన బంగార్రాజు చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ తో కలిసి సెట్స్ మీదకెళ్తాడని అందరూ అనుకుంటుంటే…. నాగార్జున మాత్రం బంగార్రాజు సినిమాతో రిస్క్ చేయాలనుకోవడం లేదని తెలుస్తుంది. ఇంతకుముందే నాగార్జున తో చైతు బంగార్రాజు సినిమా చేస్తున్నాడని వినిపించిన.. ప్రస్తుతం ఆ సినిమాలో ఆ రోల్ చైతు చెయ్యడం లేదని తెలుస్తుంది. అయితే నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు ని పక్కనబెట్టి.. మరో కొత్త కథతో సినిమా చెయ్యాలనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఆయన అభిమానులు మాత్రం బిగ్ బాస్ ఫినిష్ అయ్యింది.. కొత్త సినిమా ఎప్పుడు బాస్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం కొత్త దర్శకుడు తో మాట్నీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై తన కొత్త సినిమా అతి త్వరలోనే ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News