ఇక్కడ దెబ్బ పడింది…. అక్కడ పేరొచ్చింది

ఓవర్ కాన్ఫిడెంట్ తో ఒకే ఒక్క సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడిని తీసుకొచ్చి.. మన్మధుడు కి సీక్వెల్ అంటూ.. సినిమా విడుదలకు ముందు మన్మధుడు సీక్వెల్ కాదు [more]

Update: 2019-08-14 06:25 GMT

ఓవర్ కాన్ఫిడెంట్ తో ఒకే ఒక్క సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడిని తీసుకొచ్చి.. మన్మధుడు కి సీక్వెల్ అంటూ.. సినిమా విడుదలకు ముందు మన్మధుడు సీక్వెల్ కాదు మన్మధుడు 2 అంటూ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్ లో పడేసిన నాగార్జున.. సినిమా విడుదలయ్యాక కూడా మా సినిమా హిట్ అంటూ సక్సెస్ మీట్ పెట్టి మరీ డబ్బా కొట్టాడు. కానీ ఫ్రైడే ఫస్ట్ షో కే యావరేజ్ టాక్ తెచ్చుకున్న మన్మధుడు 2 కి వరసగా వచ్చిన మూడు రోజుల సెలవులు కలిసొచ్చి కలెక్షన్స్ బావుంటాయని ఆశపడ్డారు. కానీ మూడు రోజుల సెలవులు కూడా మన్మధుడు 2 ని కాపాడలేకపోయాయి. మన్మధుడు 2 కి యావరేజ్ టాక్ దెబ్బేసింది. కాబట్టే మూడు రోజుల సెలవుల్లోనూ సో సో కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా మన్మధుడు 2 కి మొదటి నాలుగు రోజుల్లో కేవలం 8.86 కోట్లు కొల్లగొట్టింది. ఇది నాగార్జున క్రేజ్ కి అస్సలు ఏమాత్రం మ్యాచ్ కాని ఫిగర్.

ఇక నిన్న మంగళవారం మన్మధుడు 2 కలెక్షన్స్ బొత్తిగా పడిపోయాయి. వీక్ డేస్ వర్కింగ్ డే కావడంతో మంగళవారం మన్మధుడు 2 థియేటర్స్ లో ప్రేక్షకులు బొత్తిగా కరువయ్యారు. మరి ఆఫీసర్ తో డిజాస్టర్ కొట్టిన నాగార్జున, దేవదాస్ తో పర్వాలేదనిపించినా…. ఇక ఎంతో నమ్మి పెట్టుబడి పెట్టి మరీ హీరో గా నటించిన మన్మధుడు 2 కూడా నాగార్జున కి ఝలక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ప్లాప్స్ లో సతమతమవుతున్న నాగార్జున అటు బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా మాత్రం ఇరగదీసేస్తున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ గా నాగ్ చేస్తున్న యాంకరింగ్ వల్లనే బాస్ సీజన్ 3 ని ఇషపడే ప్రేక్షకులు పెరిగారు. లేదంటే షో మొదలైనప్పుడు అస్సలు క్రేజ్ లేని బిగ్ బాస్ షో…. ఇప్పుడు 23 రోజులు గడిచేసరికి బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొంటుంది అంటే అది కేవలం హోస్ట్ నాగార్జున వల్లే అంటున్నారు అభిమానులు.

Tags:    

Similar News