కావాలనే అవాయిడ్ చేస్తున్నారా?

అఖిల్ ని ఏదో ఒకవిధంగా సెట్ చేద్దాం అని నాగార్జున చాలా ట్రై చేస్తున్నాడు. అందుకే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో కూడా నాగార్జున మాట్లాడి అఖిల్ [more]

Update: 2019-08-09 05:34 GMT

అఖిల్ ని ఏదో ఒకవిధంగా సెట్ చేద్దాం అని నాగార్జున చాలా ట్రై చేస్తున్నాడు. అందుకే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో కూడా నాగార్జున మాట్లాడి అఖిల్ తో సినిమా చేయాలనీ కోరాడు. కానీ త్రివిక్రమ్ ఏమీ స్పందించకపోవడంతో నాగ్ కి కోపం వచ్చింది. అందుకే నాగ్ మన్మధుడు విషయం లో త్రివిక్రమ్ కి ఎటువంటి క్రెడిట్‌ ఇవ్వడం లేదు. మన్మధుడు సినిమా అంతలా హిట్ అవ్వడానికి కారణం త్రివిక్రమ్ కూడా ఒక్కడు. కానీ నాగ్ మాత్రం అతని మీద కోపం తో అతనికి క్రెడిట్స్ ఇవ్వడంలేదు.

కావాలనే చేస్తున్నారా…

నాగ్ కావాలని అతని పేరు అవాయిడ్‌ చేస్తుండడం గమనించిన మీడియా ఇదే విషయాన్ని నాగ్‌ దగ్గర ప్రస్తావిస్తే..తనకి మన్మధుడు కథ విజయ్ భాస్కరే చెప్పాడని..విజయ్ రోజు పంచ్ లు వేసేవాడని ఇంకా ఆ మూవీ గురించి నన్ను ఏమి అడగొద్దు అని నాగ్ అనడం ఆశ్చర్యం. దీనిబట్టి క్లియర్ గా అర్ధం అవుతుంది ఏంటంటే త్రివిక్రమ్ విషయం లో నాగ్ హర్ట్ అయ్యాడని.

ఆయనే కారణమయినా….

నాగ్ హర్ట్ అయినంత మాత్రాన త్రివిక్రమ్ కి ఏమి తగ్గదు. త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికి తెలుసు. మన్మధుడు అంతలా హిట్ అవ్వడానికి త్రివిక్రమే కారణం అని కూడా తెలుసు. అయినా నాగ్ అలా మాట్లాడాల్సింది కాదు. త్రివిక్రమ్ తో ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవసరం ఉంటుంది. పొరపాటున చైతు తో కానీ అఖిల్ తో కానీ త్రివిక్రమ్ సినిమా చేయాల్సివస్తే అప్పుడు నాగ్ ఏం చేస్తాడు?

Tags:    

Similar News