అక్కినేని ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉందిగా..!

Update: 2018-10-01 07:32 GMT

ప్రస్తుతం అక్కినేని నాగార్జున ఫ్యామిలీ మొత్తం వెకేషన్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నాగార్జున దేవదాస్ హిట్ జోష్ లో కుమారులతో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళితే... నాగ చైతన్య, సమంతలు తమ సినిమాలు శైలజారెడ్డి అల్లుడు, యూ-టర్న్ విడుదల కాగానే ఈ వెకేషన్స్ కి చెక్కేశారు. ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళితే ఆ ఎంజాయే వేరు. ప్రస్తుతం అక్కినేని నాగార్జున ఫ్యామిలీ స్పెయిన్‌లోని ఐబిజాలోఅలానే ఎంజాయ్ చేస్తూ పెద్ద కొడుకు నాగ చైతన్య కోడలు సమంతల పెళ్లి రోజు వేడుకలకి సిద్ధమవుతున్నారు. చైతు, సమంత, అఖిల్ కొద్దిమంది ఫ్రెండ్స్ తో కలిసి ముందే ఐబిజాకి వెళ్లగా.. అక్కడికి నాగ్ తన భార్య అమలతో సహా వెళ్లి ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. దేవదాస్ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వడంతో కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి చేస్తున్న విహారయాత్ర మరింత సరదాగా ఉందని చెప్పిన నాగార్జున ఈ అందమైన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

తిరిగి వచ్చాక ఫుల్ బిజీ...

ఇక వారు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో ఈ ఫోటో బట్టి స్పష్టమవుతుంది. అక్టోబర్ 6న సమంత - నాగ చైతన్య వివాహ వార్షిక మహోత్సవాన్ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుకోవడానికి ఈ అక్కినేని జంటలు అలా ఐబిజా ద్వీపంలో తెలియాడుతున్నాయి. ఇక అక్కినేని ఫ్యామిలీతో పాటుగా నాగ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి, సామ్ ఫ్రెండ్ నీరజ కోన మరికొంతమంది అక్కినేని ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక అక్కడినుండి రాగానే సమంత - చైతు కలిసి శివ నిర్వాణ సినిమాలో కలిసి జంటగా నటిస్తారు. ఇక అఖిల్ వెంకీ అట్లూరితో మిస్టర్ మజ్ను నెక్స్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు. నాగార్జున కూడా తన తదుపరి ప్రాజెక్ట్ లో బిజీ అవుతాడు.

Similar News