అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఫిక్స్..!

గత రెండేళ్ల నుండి అక్కినేని ఫ్యామిలీకి అంతగా కలిసి రావడం లేదు. ముఖ్యంగా అక్కినేని అఖిల్ కి. అఖిల్ సినిమాతో తన కెరీర్ స్టార్ట్ అయినప్పటికీ ఇంతరవరకు [more]

Update: 2019-02-19 08:57 GMT

గత రెండేళ్ల నుండి అక్కినేని ఫ్యామిలీకి అంతగా కలిసి రావడం లేదు. ముఖ్యంగా అక్కినేని అఖిల్ కి. అఖిల్ సినిమాతో తన కెరీర్ స్టార్ట్ అయినప్పటికీ ఇంతరవరకు చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. రీసెంట్ గా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేసిన ‘మిస్టర్ మజ్ను’ కూడా మిక్సడ్ టాక్ తో ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని స్టోరీస్ విందాం అనుకున్న అఖిల్ తన నాలుగో చిత్రం ఫైనల్ చేసాడు. ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం అఖిల్ నెక్స్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు కథ కూడా ఫైనల్ అయిందట.

బొమ్మరిల్లు భాస్కర్ తో…

ఈ మూవీని గీతా ఆర్ట్స్ వారు నిర్మించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ కి సక్సెస్ రేట్ ఎక్కువ. కాబట్టి అఖిల్ ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడేమో చూడాలి. నిజానికి గీతా ఆర్ట్స్ లోనే అఖిల్ పరశురామ్ తో గానీ, భాస్కర్ తో గానీ సినిమా చేయాలనుకున్నాడు. చివరికి భాస్కర్ తో ఫిక్స్ అయ్యాడు అఖిల్. మరి భాస్కర్ ఎటువంటి కథ రెడీ చేసాడో చూడాలి. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Tags:    

Similar News