అఖిల్ స్థానంలో వేరే హీరో అయి ఉంటే..!

అఖిల్ అక్కినేనికి ప్రస్తుతం సక్సెస్ చాలా అవసరం. బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదు.. సక్సెస్ ఉంటేనే ఆదరించే రోజులివి. మూడో చిత్రంగా వస్తున్న ‘మిస్టర్ మజ్ను’ సినిమాని [more]

Update: 2018-12-28 06:32 GMT

అఖిల్ అక్కినేనికి ప్రస్తుతం సక్సెస్ చాలా అవసరం. బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదు.. సక్సెస్ ఉంటేనే ఆదరించే రోజులివి. మూడో చిత్రంగా వస్తున్న ‘మిస్టర్ మజ్ను’ సినిమాని ఎవరూ పట్టించుకునే పరిస్థితిల్లో లేరు. అంతకు ముందు సక్సెస్ సినిమాలు ఉంటే ఈ సినిమాని పటించుకునే వాళ్ళు. అందుకే ఈ సినిమా టీజర్, సాంగ్స్ పై ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కి ఆడియన్స్ పెద్దగా అట్రాక్ట్ కాలేదు. వాస్తవానికి ‘మిస్టర్ మజ్ను’లో పాటలు బాగున్నాయి. మొదటి సాంగ్ కంటే రెండో సాంగ్ బాగుంది. తమన్ మంచి బాణీ ఇచ్చాడు. కానీ ఏమి లాభం పాపం అఖిల్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఈ సాంగ్ బాగున్నపటికి యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాలేదు.

డైరెక్టర్ సైనే భారం…

యూట్యూబ్ లో దీనికి అంతంతమాత్రంగానే వ్యూస్ వస్తున్నాయి. అదే వేరే హీరో సినిమా సాంగ్ అయితే ఈపాటికి 2 మిలియన్ వ్యూస్ వచ్చి ఉండేవి. అఖిల్ మాత్రం డైరెక్టర్ వెంకీ అట్లూరి పైనే భారం పెట్టాడు. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని చూస్తున్నాడు. ఏమాత్రం తేడా జరిగినా అఖిల్ కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News