ఈసారి అఖిల్ కి హిట్ పక్కా..!

అక్కినేని అఖిల్ కు ఇంతవరకు ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం అఖిల్ కు హిట్ చాలా అవసరం. అయితే ఈసారి అంటే అఖిల్ నాలుగో సినిమా [more]

Update: 2019-02-18 08:29 GMT

అక్కినేని అఖిల్ కు ఇంతవరకు ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం అఖిల్ కు హిట్ చాలా అవసరం. అయితే ఈసారి అంటే అఖిల్ నాలుగో సినిమా హిట్ అవ్వడం పక్కా అని అంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఈసారి అఖిల్ గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అఖిల్ కోసం ఆల్రెడీ రెండు కథలు రెడీగా ఉన్నాయట. గీతా ఆర్ట్స్ కి సక్సెస్ రేట్ ఎక్కువ అని అందరికీ తెలిసిందే. అందుకే అఖిల్ ఈసారి హిట్ కొడతాడని చెబుతున్నారు. ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్ ఇప్పటికే ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేశాడట.

అల్లు అరవింద్ నిర్మాతగా

అలానే మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ను తయారు చేశాడట. ఈ రెండింటిని అఖిల్ విని ఏదో ఒకటి ఫైనల్ చేస్తాడట. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ కాబట్టి ఈసారి అఖిల్ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్టే. అయితే అఖిల్ చేసే సినిమా కొంచం లేట్ గానే సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. మరి అఖిల్ కు గీతా ఆర్ట్స్ వారు హిట్ ఇస్తారేమో చూడాలి.

Tags:    

Similar News